ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mallikarjuna Kharge: ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్.. అసలేమైందంటే?

ABN, Publish Date - Apr 13 , 2024 | 07:58 AM

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. నేతలు తమ మాటలకు మరింత పదును పెట్టారు. ఓటర్లను ఆకర్షించడం కోసం రకరకాల హామీలు ఇస్తూనే.. ఒకరిపై మరొకరు విమర్శలు ప్రతివిమర్శలతో వాగ్వాదానికి దిగుతున్నారు. తాజాగా ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

సార్వత్రిక ఎన్నికలు (Lok Sabha Polls 2024) సమీపిస్తున్న నేపథ్యంలో.. నేతలు తమ మాటలకు మరింత పదును పెట్టారు. ఓటర్లను ఆకర్షించడం కోసం రకరకాల హామీలు ఇస్తూనే.. ఒకరిపై మరొకరు విమర్శలు ప్రతివిమర్శలతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇప్పుడు తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) చేసిన వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మోదీ మనసులో కేవలం హిందూ-ముస్లిం ఉందని, మతం పేరుతో దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తమపై వ్యాఖ్యలు చేసేముందు.. వారి చరిత్ర ఏంటో చూసుకోవాలని దుయ్యబట్టారు.

AP Politics: ‘బ్రహ్మారెడ్డిని ఊర్లోకి తెచ్చేంత మగాడివారా?!’


ఇటీవల లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి మేనిఫెస్టోలో ‘‘ముస్లిం లీగ్ సిద్ధాంతం’’ ముద్ర ఉందని అన్నారు. ఇందుకు మల్లికార్జున ఖర్గే బదులిస్తూ.. బీజేపీ నాయకులు ముందుగా తమ పార్టీ చరిత్ర చూసుకోవాలని, మతం పేరుతో వాళ్లే దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘‘ప్రధాని మోదీ మనస్సులో కేవలం హిందూ-ముస్లిం మాత్రమే ఉంది. మతం పేరుతో దేశాన్ని విభజించడం, సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారు. మా కాంగ్రెస్ మేనిఫెస్టోని వాళ్లు సరిగ్గా చదవలేదు. మేము యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పాం, మహిళలకు సంవత్సరానికి రూ.1 లక్ష ఇస్తామని తెలిపాం, రైతులకు కనీస మద్దతు ధర (MSP) గ్యారెంటీ.. ఇవన్నీ ముస్లిం లీగ్‌లో భాగమా?’’ అని ఖర్గే ప్రశ్నించారు.

Janasena: ఇన్ని రోజులు ఒక లెక్క.. రేపటి నుంచి మరో లెక్క

ఇదిలావుండగా.. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చింది. ఈసారి ఎలాగైనా బీజేపీని గద్దె దించాలన్న లక్ష్యంతో ఈ మేనిఫెస్టోని సిద్ధం చేసింది. ఇందులో.. MSPకి చట్టపరమైన హామీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయడం, వచ్చే పదేళ్లలో జీడీపీని రెట్టింపు చేయడం, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టం చేయడం, చైనాతో యథాతథ స్థితిని పునరుద్ధరించడం వంటి అనేక వాగ్దానాలు ఉన్నాయి. అంతేకాదు.. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు మొబైల్ ఫోన్లు ఇవ్వడంతో పాటు ‘GST’ని సవరిస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 13 , 2024 | 09:13 AM

Advertising
Advertising