Share News

Janasena: ఇన్ని రోజులు ఒక లెక్క.. రేపటి నుంచి మరో లెక్క

ABN , Publish Date - Apr 13 , 2024 | 07:15 AM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో తిరుపతిలో జరిగిన భేటీ అనంతరం ఆ పార్టీ నేత కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో ప్రతి విషయంపై పవన్ వద్ద పూర్తి డేటా ఉందని, తమకంటే ఆయన దగ్గర ఎక్కువ సమాచారం ఉందని చెప్పారు.

Janasena: ఇన్ని రోజులు ఒక లెక్క.. రేపటి నుంచి మరో లెక్క

జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్‌తో (Pawan Kalyan) తిరుపతిలో జరిగిన భేటీ అనంతరం ఆ పార్టీ నేత కిరణ్ రాయల్ (Kiran Royal) కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో ప్రతి విషయంపై పవన్ వద్ద పూర్తి డేటా ఉందని, తమకంటే ఆయన దగ్గర ఎక్కువ సమాచారం ఉందని చెప్పారు. 2009 నుంచి తనకు పవన్‌తో అనుబంధం ఉందన్న ఆయన.. నువ్వు నా ఇంటి బిడ్డ లాంటోడివని, నీ భవిష్యత్తు నేను చూసుకుంటానని పవన్ తనకు హామీ ఇచ్చారని అన్నారు. తమ అందరి భవిష్యత్తుకి భరోసానిస్తానంటూ పవన్ తన భుజం తట్టారన్నారు. తనని నమ్ముకున్న కార్యకర్తకు ఎలా అండగా ఉంటానో చూస్తారని పవన్ చెప్పడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఇకపై తాము తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గెలుపు కోసం పని చేస్తామని.. ఇన్ని రోజులు ఒక లెక్క, రేపటి నుంచి మరో లెక్కగా పని చేస్తామని ఉద్ఘాటించారు.

తెలంగాణలో వ్యాపారం చేయలేవ్‌


ఇదిలావుండగా.. తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులును (Arani Srinivasulu) మార్చే అవకాశం ఉందంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. తిరుపతి అభ్యర్థిగా శ్రీనివాసులు ఎవరికీ పెద్దగా తెలియదు కాబట్టి.. తిరుపతి కూటమి నేతల ఫీడ్‌బ్యాక్ మేరకు కిరణ్ రాయల్‌ను రంగంలోకి దింపనున్నారని పుకార్లు చక్కర్లు కొట్టాయి. కూటమి అభ్యర్థుల్లో మొత్తం ఐదు సీట్లు మారుస్తారని, అందులో భాగంగానే తిరుపతి అభ్యర్థిగా కిరణ్ రాయల్ పేరుని పరిశీలిస్తున్నారని, దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) నివాసంలో ఎన్డీఏ కూటమి నేతలు చర్చలు జరిపినట్టు వాదనలు వినిపించాయి. అయితే.. తిరుపతి అభ్యర్థి మార్పు లేదని తాజాగా కిరణ్ రాయల్ వ్యాఖ్యలతో తేలిపోయింది. ఆరణి శ్రీనివాసులు గెలుపు కోసం తాము పని చేస్తామని నొక్కి చెప్పారు కాబట్టి.. తిరుపతి స్థానంలో మార్పు ఉండదన్నది స్పష్టత వచ్చేసింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 13 , 2024 | 07:19 AM