ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bengaluru Blast: బాంబు పేలుడేనని చెప్పిన సీఎం

ABN, Publish Date - Mar 01 , 2024 | 08:00 PM

కర్ణాటక రాజధాని నగరమైన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ లో చోటుచేసుకున్న పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. కేఫ్‌లో దాడికి ఐఈడీ ఉపయోగించినట్టు చెప్పారు. కేఫ్‌లోకి వచ్చిన ఓ వ్యక్తి బ్యాగు పెట్టి వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిందన్నారు.

బెంగళూరు: కర్ణాటక రాజధాని నగరమైన బెంగళూరు (Bengaluru)లోని రామేశ్వరం కేఫ్‌ (Rameshwaram cafe)లో శుక్రవారంనాడు చోటుచేసుకున్న పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) స్పందించారు. కేఫ్‌లో దాడికి ఐఈడీ (IED) ఉపయోగించినట్టు చెప్పారు. కేఫ్‌లోకి వచ్చిన ఓ వ్యక్తి బ్యాగు పెట్టి వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిందన్నారు.


''పేలుడు జరిగినట్టు మధ్యాహ్నం 12.30 గంటలకు సమాచారం వచ్చింది. అక్కడ ఓ బ్యాగ్ కూడా ఉంది. అది పేలుడు పదార్ధం అని తెలిసింది. దీనిపై విచారణ జరుగుతోంది'' అని మీడియాతో మాట్లాడుతూ సిద్ధరామయ్య తెలిపారు. హోటల్ సిబ్బందితో సహా 8 మందికి గాయాలైనట్టు చెప్పారు. టెర్రరిస్టు చర్యగా భావిస్తున్నారా అని అడిగినప్పుడు, ఇప్పటికైతే ఇంకా ఏమి తెలియదని, విచారణ జరుగుతోందని సమాధానమిచ్చారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని, ఈ ఘటనపై విపక్షాలు రాజకీయాలు చేయకుండా సంయమనం పాటించాలని కోరారు. కాగా, క్షతగాత్రులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని కర్ణాటక పోలీస్ చీఫ్ అలోక్ మోహన్ తెలిపారు.

Updated Date - Mar 01 , 2024 | 08:08 PM

Advertising
Advertising