ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hero Vijay: ఈ ఎన్నికల్లో ఇళయ దళపతి వర్గం ఎటువైపో?

ABN, Publish Date - Apr 14 , 2024 | 11:52 AM

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా ప్రముఖ నటులు రజనీకాంత్‌, ‘దళపతి’ విజయ్‌(Vijay) ఎవరిపక్షమన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతుంది. రజనీ అయితే రాజకీయాలను పూర్తిగా వదిలేసినట్లే గనుక ఆయన అభిమానులు వారి ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుంటారని ఇప్పటికే స్పష్టమైపోయింది.

- ఆయన అభిమానుల్ని ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలూ పోటీ?

చెన్నై: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా ప్రముఖ నటులు రజనీకాంత్‌, ‘దళపతి’ విజయ్‌(Vijay) ఎవరిపక్షమన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతుంది. రజనీ అయితే రాజకీయాలను పూర్తిగా వదిలేసినట్లే గనుక ఆయన అభిమానులు వారి ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుంటారని ఇప్పటికే స్పష్టమైపోయింది. దీనికి తోడు ఆయన ఇటు డీఎంకే(DMK) నేతలతోనూ, అటు బీజేపీ అగ్రనేతలతోనూ సన్నిహిత సంబంధాలున్నందున, ఎవరికి వారుగా ఆయా పక్షాలను ఆశ్రయిస్తున్నది సుస్పష్టం. ఇక ఇటీవలే ‘తమిళగ వెట్రి క్కళగం’ పార్టీని స్థాపించి, రాష్ట్ర వ్యాప్తంగా యువతలో సరికొత్త ఆశలు రేపిన దళపతి విజయ్‌(Dalapati Vijay) ఎటువైపు అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. విజయ్‌ పార్టీని స్థాపించిన కొద్దినాళ్లకే 76 లక్షల మంది ఆ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. పార్టీ స్థాపన నుంచి ఆయన కేవలం ప్రకటనల ద్వారా మాత్రమే పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తమిళనాడు ప్రజలు ఏం ఆశిస్తున్నారో తాము దాన్ని నెరువేరుస్తామని పదేపదే ప్రకటిస్తున్నారు. అంతేగాక పార్టీ సిద్ధాంతాలు, జెండా, అజెండా తదితరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఏం చేయాలన్నది తాను చూసుకుంటానని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

కాగా ఆయన ఇంకా పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి దిగలేదనే చెప్పాలి. మరోవైపు విజయ్‌ పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారాలని తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆయన అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికలే తమ లక్ష్యమని, ఈ లోక్‌సభ ఎన్నికల్లో తాము తటస్థంగా ఉంటామని ఇప్పటికే విజయ్‌ ప్రకటించారు. దీంతో ఈ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేయనందున, ఆయన అభిమానులు, కార్యకర్తలను తమవైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీల నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. గతంలో విజయ్‌తో తాము సన్నిహితంగా వున్న ఫొటోలను విస్త్రతంగా ప్రచారం చేసుకుంటుండడంతో పాటు ఆయన వీరాభిమానుల్ని ప్రసన్నం చేసుకుని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయ్‌ మాత్రం వీటన్నింటికీ దూరంగా ఓ చిత్రం షూటింగ్‌ కోసం ఆస్ట్రేలియాలో బిజీగా గడుపుతున్నారు. ఆయన ఈ నెల 17, 18 తేదీల్లో చెన్నైకి వచ్చే అవకాశముందని సమాచారం.

ఇదికూడా చదవండి: PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ కీలక స్పీచ్.. వచ్చే ఐదేళ్లలో..

Updated Date - Apr 14 , 2024 | 11:52 AM

Advertising
Advertising