ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Election Commission of India: బిగ్ అలర్ట్.. వైరల్ అవుతున్న ఆ నోటిఫికేషన్ ఫేక్..!

ABN, Publish Date - Mar 13 , 2024 | 08:00 PM

Election Commission of India: సోషల్ మీడియాలో ఏదీ నమ్మే పరిస్థితి లేదు. ఇది నిజమో.. ఏది అబద్ధమో తేల్చుకునే లోపే.. అబద్ధం ప్రపంచమంతా చుట్టేస్తోంది. తాజాగా ఇలాంటిదే జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘంలో(Election Commission of India) ఒకే ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) ఉండగా.. ఇద్దరు కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీని ఆధారంగా లబ్ధిపొందాలనుకున్న కేటుగాళ్లు.. ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్ల నియామకం అంటూ ఫేక్ నోటిఫికేషన్(Fake Notification) సర్క్యూలేట్..

Election Commission of India

Election Commission of India: సోషల్ మీడియాలో ఏదీ నమ్మే పరిస్థితి లేదు. ఇది నిజమో.. ఏది అబద్ధమో తేల్చుకునే లోపే.. అబద్ధం ప్రపంచమంతా చుట్టేస్తోంది. తాజాగా ఇలాంటిదే జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘంలో(Election Commission of India) ఒకే ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) ఉండగా.. ఇద్దరు కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీని ఆధారంగా లబ్ధిపొందాలనుకున్న కేటుగాళ్లు.. ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్ల నియామకం అంటూ ఫేక్ గెజిట్ నోటిఫికేషన్(Fake Notification) సర్క్యూలేట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించిందని, భారత రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర తెలిపిందని సదరు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు రాజేష్ కుమార్ గుప్తా, ప్రియాన్ష్ శర్మ లను ఎన్నికల కమిషనర్లుగా నియమించారంటూ ఒక నోట్‌ను సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారు కేటుగాళ్లు. వైరల్ అవుతున్న ఈ నోట్‌ను చాలా మంది నిజం అని నమ్మారు. దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. ఇంకా ఎవరినీ కమిషనర్లుగా నియమించలేదని స్పష్టం చేసింది. ఇలాంటి ఫేక్ నోటిఫికేషన్లను నమ్మవద్దని ప్రజలకు సూచించింది కేంద్ర ప్రభుత్వం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 13 , 2024 | 08:06 PM

Advertising
Advertising