ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

India - China: మీ ఇంటి పేరు మార్చితే అది నాది అవుతుందా.. చైనాకు జై శంకర్ కౌంటర్..

ABN, Publish Date - Apr 02 , 2024 | 01:15 PM

వాస్తవాధీన రేఖ వద్ద డ్రాగన్ దేశం నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు పేర్లు పెట్టింది. ఈ చర్యను భారత్ ( India ) తీవ్రంగా ఖండిస్తోంది. ఇలా ఇప్పడే కాదు గతంలోనూ పలు మార్లు పేర్లు మారుస్తూ మూడు జాబితాలను రిలీజ్ చేసింది.

వాస్తవాధీన రేఖ వద్ద డ్రాగన్ దేశం నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు పేర్లు పెట్టింది. ఈ చర్యను భారత్ ( India ) తీవ్రంగా ఖండిస్తోంది. ఇలా ఇప్పడే కాదు గతంలోనూ పలు మార్లు పేర్లు మారుస్తూ మూడు జాబితాలను రిలీజ్ చేసింది. ఇలాంటి చర్యలు మానుకోవాలని ఇండియా హెచ్చరిస్తున్నా చైనా తీరులో మాత్రం మార్పు రావడం లేదు. భారతదేశంలో త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చైనా మరోసారి పేర్లు మార్చడం సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ చైనాకు చురకలు అంటించింది. మీ ఇంటి పేరు మార్చితే అది నాదవుతుందా అని కేంద్ర మంత్రి జై శంకర్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. దీనిని బట్టి చైనా ఎంత తెలివితక్కువ తనంతో వ్యవహరిస్తోందో అర్థమవుతోందన్నారు.

Patanjali Case: పతంజలి తప్పుడు ప్రకటనల కేసు.. సుప్రీం కోర్టుకు రామ్ దేవ్ క్షమాపణలు..

" అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో ఎప్పటికీ అంతర్భాగమే. చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఆ ప్రయత్నాలను మేము గట్టిగా తిరస్కరిస్తాం. కొత్త పేర్లు పెట్టినంత మాత్రాన అరుణాచల్ ప్రదేశ్ చైనా అధీనంలోకి వెళ్లిపోదు. వాస్తవాలను మార్చలేదు."

- జైశంకర్, కేంద్ర మంత్రి

Viral Video: చెమటలు పట్టించిన చిరుత.. ఇళ్ల పై కప్పు నుంచి దూకుతూ.. వీడియో వైరల్..


కాగా.. చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాంగ్నాన్‌లో అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టిన నాలుగో జాబితాను విడుదల చేసింది. దీనిపై ప్రతిపక్షాలు సైతం స్పందించాయి. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతానికి చైనా పేరు మార్చడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఖండించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 02 , 2024 | 01:15 PM

Advertising
Advertising