Home » Jai Shankar
ప్రపంచ దేశాలకు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక హెచ్చరిక చేశారు. రానున్న నెలల్లో ప్రపంచం భారీ ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
జాతీయ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత్‌పై పొరుగుదేశం ఉగ్రవాదులను ఉసిగొల్పినంత కాలం గట్టిగా బదులు చెప్తామని పాకిస్తాన్‌కు ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు.
ఉగ్రవాదం పాకిస్థాన్‌కు అలవాటైందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 81వ సమావేశంలో ఆయన మాట్లాడారు. వాస్తవాలను దాచి తప్పుడు లెక్కలు చూపెడుతోందని పాక్‌పై ఆయన మండిపడ్డారు.
పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తాజాగా విమర్శలు గుప్పించారు. రష్యా చమురును కొనుగోలు చేయమని 2022లో అమెరికా భారత్‌ను అభ్యర్థించిందని చెప్పారు.
ఇంధన సరఫరాలో తలెత్తే అంతరాయాలను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి క్వాడ్ కూటమి.. ‘ఇండో పసిఫిక్ ఇంధన భద్రత మార్గదర్శక ప్రణాళిక’ను విడుదల చేసింది..
అమెరికా తన వీసా విధానంలో తీసుకొచ్చిన మార్పులతో భారతీయులు తీవ్రంగా నష్టపోతున్నారని విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు.
ఉక్రెయిన్ రక్షణ శాఖ కార్యదర్శి, జెలెన్‌స్కీ సన్నిహితుడు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ భద్రతా సలహాదారు, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రులతో ప్రత్యేక భేటీ నిర్వహించారు.
మధ్యప్రాచ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలు, భారత నౌకల భద్రతకు సంబంధించి ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మూడు రౌండ్లు చర్చలు జరిపినట్టు కేంద్ర విదేశాంగ శాఖ గురువారంనాడు తెలిపింది.
కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ సోమవారం రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. పశ్చిమాసియా దేశాల్లో పరిస్థితులను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని అన్నారు. గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రతకు కేంద్రం కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు.
వ్యూహాత్మక అంశాల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడమే భారత దేశ విధానమని మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. చమురు కొనుగోళ్లకు సంబంధించి భారతీయ కంపెనీలు తమ ప్రయోజనాలను అనుసరించి నిర్ణయాలు తీసుకుంటాయని అన్నారు.