Share News

Pakistan slams Jaishankar: పాకిస్థాన్ ఆర్మీపై జైశంకర్ విమర్శలు.. పాక్ యంత్రాంగం ఆగ్రహం..

ABN , Publish Date - Dec 08 , 2025 | 07:12 AM

భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పై పాకిస్థాన్ యంత్రాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం ఓ సదస్సులో పాల్గొన్న జైశంకర్.. పాకిస్థాన్ ఆర్మీ, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునిర్‌ గురించి మాట్లాడారు.

Pakistan slams Jaishankar: పాకిస్థాన్ ఆర్మీపై జైశంకర్ విమర్శలు.. పాక్ యంత్రాంగం ఆగ్రహం..
Jaishankar Pakistan remarks

భారత్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పాక్ ఆర్మీనే కారణమని, పాక్ ఆర్మీ భారత్‌పై సైద్ధాంతిక శత్రుత్వానికి పాల్పడుతోందని విమర్శించిన విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar)పై పాకిస్థాన్ యంత్రాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం ఓ సదస్సులో పాల్గొన్న జైశంకర్.. పాకిస్థాన్ ఆర్మీ, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునిర్‌ గురించి మాట్లాడారు (India security challenges).


జైశంకర్ వ్యాఖ్యలను ఖండిస్తూ పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ ఆదివారం స్పందించారు. జైశంకర్ బాధ్యతారహిత్యమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. జైశంకర్ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టాలా ఉన్నాయని, ఆయన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని పేర్కొన్నారు. తమ సాయుధ బలగాలతో పాటు అన్ని స్వదేశీ వ్యవస్థలు జాతీయ భద్రతా కోణంలోనే పని చేస్తాయని తెలిపారు (Pakistani military criticism).


ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, ఉగ్రవాద శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేయడం వంటివి చూసినప్పుడు వారు ఇండియా పట్ల శత్రుత్వ విధానాన్ని అనుసరించడం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇదంతా చేస్తున్నదెవరు? పాక్ ఆర్మీనే' అని జైశంకర్ పేర్కొన్నారు (Jaishankar Pakistan remarks). ఇక, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునిర్‌ గురించి మాట్లాడుతూ.. టెర్రరిస్టుల్లో మంచి టెర్రరిస్టులు, చెడ్డ టెర్రరిస్టులు ఉండరని, అలాగే మంచి మిలటరీ నాయకులు, చెడ్డ మిలటరీ నాయకులు కూడా ఉండరని అన్నారు.


ఇవీ చదవండి:

మోదీజీ నాకు న్యాయం చేయండి ప్లీజ్.. పాక్ మహిళ ఆవేదన..

ఈ చిట్కాలతో పీసీఓఎస్, డయాబెటిస్‌ను అదుపు చేయండిలా...

Updated Date - Dec 08 , 2025 | 07:12 AM