Share News

Pak woman seeks to PM Modi: మోదీజీ నాకు న్యాయం చేయండి ప్లీజ్.. పాక్ మహిళ ఆవేదన..

ABN , Publish Date - Dec 07 , 2025 | 05:19 PM

ఇండియాలో ఉంటున్న తన భర్త మరో పెళ్లికి సిద్ధమయ్యాడంటూ.. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ పాక్‌కు చెందిన ఓ మహిళ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. తనకు న్యాయం జరగకపోతే మహిళలకు న్యాయస్థానంపై ఉన్న నమ్మకం పోతుందని ఓ వీడియో పోస్ట్ చేశారామె. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆ వీడియో కథనానికి చెందిన పూర్తి వివరాలిలా...

Pak woman seeks to PM Modi: మోదీజీ నాకు న్యాయం చేయండి ప్లీజ్.. పాక్ మహిళ ఆవేదన..
Pak woman seeks to PM Modi

ఇంటర్నెట్ డెస్క్: 'మోదీజీ.. ప్లీజ్ నాకు న్యాయం చేయరూ..' అని పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ భారత ప్రధాని నరేంద్ర మోదీని కోరారు(Pak Woman Seeks India PM). భర్త తనను కరాచీ(Karachi)లో వదిలేసి.. భారత్‌లో రహస్యంగా మరో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆరోపిస్తూ.. ఈ తరుణంలో మీరే నాకు న్యాయం చేయాలని మోదీని అభ్యర్థించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వివరాల్లోకెళితే...


బతిమిలాడినా.. నిరాకరణే..

పాక్‌కు చెందిన నిఖితా నాగ్‌దేవ్(Nikhita Nagdev) అనే మహిళ.. అదే దేశానికి చెందిన విక్రమ్ నాగ్‌దేవ్(Vikram Nagdev) అనే వ్యక్తిని 2020 జనవరి 26న హిందూ సంప్రదాయ పద్ధతి(Hindu Tradition)లో వివాహమాడారు. పెళ్లైన కొద్దిరోజులకే 2020 ఫిబ్రవరి 26న ఆమెను ఇండియా(India)కు తీసుకొచ్చారు విక్రమ్. కొన్ని నెలల తర్వాత.. వీసా(Visa) సమస్య సాకుతో 2020 జులై 9న ఆమెను బలవంతంగా అటారీ సరిహద్దు వద్ద వదిలేసి ఒంటరిగా పాక్‌కు పంపించారు. మళ్లీ తనను ఇండియాకు తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదని నిఖిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాకు వస్తానని ఎంత బతిమిలాడినా నిరాకరించాడని.. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారామె. ఈ విషయంలో తనకు న్యాయం జరగకపోతే న్యాయవ్యవస్థపై మహిళలకున్న నమ్మకం సన్నగిల్లుతుందని.. తనకు అండగా నిలవాలని అభ్యర్థించారు నిఖిత.


'నేను నిఖితా నాగ్‌దేవ్. విక్రమ్ నాగ్‌దేవ్ భార్యను. కరాచీ నుంచి మాట్లాడుతున్నాను. నా భర్త నన్ను మోసం చేసి.. భారత్‌కు వెళ్లి అక్కడే నివాసముంటున్నాడు. ప్రస్తుతం.. మధ్యప్రదేశ్‌(Madhyra Pradesh)లోని ఇందోర్(Indore) ప్రాంతంలో ఉంటూ.. ఇంకొకరిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. నా భర్తపై చర్యలు తీసుకుని అతడిని వెంటనే పాకిస్థాన్‌(Pakistan)కు పంపండి' అని ప్రధాని మోదీ(Prime Minister Modi)కి విజ్ఞప్తి చేశారు నిఖిత. తనకు జరిగిన అన్యాయాన్ని గురించి వివరిస్తూ.. 2025 జనవరి 27న లిఖిత పూర్వకంగా ఫిర్యాదుచేసినట్టు చెప్పుకొచ్చారు.


విచారణ కొనసాగుతుండగానే..

ఈ కేసుపై మధ్యప్రదేశ్ హైకోర్టుచే అధికారం పొందిన సింధీ పంచ్(Sindhi Panch) మధ్యవర్తిత్వ, న్యాయ సలహా కేంద్రం విచారణ చేపట్టింది. అయితే.. మధ్యవర్తిత్వ ప్రయత్నాలు విఫలమయ్యాయి. నిఖిత, విక్రమ్‌లిద్దరూ భారత పౌరులు కాకపోవడంతో.. ఈ కేసు పాక్ పరిధిలోకి వస్తుందని పేర్కొంది. విక్రమ్‌ను వెంటనే పాక్‌కు తరలించాలని గత ఏప్రిల్ 30న సిఫార్సు చేసింది. ఈ కేసు ఇందోర్ సోషల్ పంచాయతీ దృష్టికి వెళ్లగా.. సింధీ పంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ విషయమై విచారణకు ఆదేశించినట్టు ఇందోర్ కలెక్టర్ ఆశిస్ సింగ్(Collector Asish Singh) ధృవీకరించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో నిఖిత.. ఇలా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తూ వీడియో షేర్ చేశారు.


ఇవీ చదవండి:

గోవా నైట్ క్లబ్ ప్రమాదం.. వెలుగులోకి భయానక వీడియో..

హైదరాబాద్‌లో బాబ్రీ మెమోరియల్‌.. ప్రకటించిన తెహ్రీక్ ముస్లిం షబ్బన్

Updated Date - Dec 07 , 2025 | 07:05 PM