Share News

Babri Memorial: హైదరాబాద్‌లో బాబ్రీ మెమోరియల్‌.. ప్రకటించిన తెహ్రీక్ ముస్లిం షబ్బన్

ABN , Publish Date - Dec 07 , 2025 | 03:42 PM

బాబ్రీ మసీదు కూల్చివేత జరిగి 33 ఏళ్లయిన సందర్భంగా ఈనెల 6న జరిగిన బహిరంగ సమావేశంలో తెహ్రీక్ ముస్లిం షబ్బాన్ అధ్యక్షుడు ముస్తాఖ్ మాలిక్ సంచలన ప్రకటన చేశారు.

Babri Memorial: హైదరాబాద్‌లో బాబ్రీ మెమోరియల్‌.. ప్రకటించిన తెహ్రీక్ ముస్లిం షబ్బన్
Mushtaq Malik

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌లో బాబ్రీ మసీదు తరహాలో కట్టడం నిర్మిస్తామని తృణమూల్ కాంగ్రెస్ (TMC) సస్పెండెడ్ ఎమ్మెల్యే హుమయూన్ కబీర్ ఇటీవల ప్రకటించిన క్రమంలో అన్ని సౌకర్యాలతో గ్రేటర్ హైదరాబాద్‌లో బాబ్రీ స్మారకం (Babri memorial) నిర్మిస్తామని హైదరాబాద్‌కు చెందిన ముస్లిం సంస్థ ఒకటి ప్రకటించింది.


బాబ్రీ మసీదు కూల్చివేత జరిగి 33 ఏళ్లయిన సందర్భంగా ఈనెల 6న జరిగిన బహిరంగ సమావేశంలో తెహ్రీక్ ముస్లిం షబ్బాన్ అధ్యక్షుడు ముస్తాఖ్ మాలిక్ తాజా ప్రకటన చేశారు. బాబ్రీ యానివర్శిటీతో పాటు రొటీన్ పబ్లిక్ మీటింగ్‌లో గ్రేటర్ హైదరాబాద్‌లో బాబ్రీ మసీదు మెమోరియల్ నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. ఈ మెమోరియల్‌లో కొన్ని సంక్షేమ సంస్థలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఏ విధంగా దీన్ని నిర్మిస్తాం, ఎప్పుడు నిర్మిస్తాం అనే వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.


రాముడి పుట్టిన జన్మస్థలంలో మసీదు కట్టడంపై చిరకాలంగా వివాదం కొనసాగడంతో బాబ్రీ మసీదును 1992లో కరసేవకులు కూల్చేశారు. రామమందిర నిర్మాణానికి 2019లో సుప్రీంకోర్టు మార్గం సుగమం చేయడంతో అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించడంతో పాటు ఇటీవల ధ్వజారోహణ నిర్వహించారు.


బాబర్ పేరుతో కట్టడాలను వ్యతిరేకిస్తాం

కాగా, సస్పెండెడ్ టీఎంసీ ఎమ్మెల్యే హుమయూన్ కబీర్ శనివారంనాడు ముర్షీదాబాద్‌లో బాబ్రీ మసీదు తరహాలో కట్టడం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేరోజు హైదరాబాద్‌లో బాబ్రీ మెమోరియల్ ప్రకటన వెలువడటం ఆసక్తికరం. బెంగాల్‌లో బాబ్రీ మసీదు శంకుస్థాపన వ్యవహారంపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం పోలరైజేషన్‌కు పాల్పడుతోందని, బాబర్‌ పేరుతో ఎలాంటి కట్టడాన్నయినా భారత్ వ్యతిరేకిస్తుందని అన్నారు. అయితే బీజేపీ వాదనను హుమయూన్ కబీర్ తోసిపుచ్చారు. మసీదు నిర్మాణం తన హక్కు అని, తాము రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమీ చేయడం లేదని చెప్పారు. ఎవరైనా మందిరం, చర్చి నిర్మించుకోవచ్చని, తాను మసీదు నిర్మిస్తున్నానని చెప్పారు. రూ.300 కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణం చేపడతామని, అందులో ఒక ఆసుపత్రి, గెస్ట్‌ హౌస్, మీటింగ్ హాల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

సిద్ధూ మళ్లీ రాజకీయాల్లోకి.. అయితే ఒక కండిషన్

గోవా అగ్నిప్రమాద ఘటన.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 07 , 2025 | 04:00 PM