PM Narendra Modi: గోవా అగ్నిప్రమాద ఘటన..ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని
ABN , Publish Date - Dec 07 , 2025 | 07:32 AM
గోవాలోని అర్పోరాలోని రోమియోలేన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బిర్చ్ నైట్ క్లబ్‌లో సిలిండర్ పేలి 23 మంది మృతి చెందారు. మృతులంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. ఈ ఘటనపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్, డిసెంబరు7 (ఆంధ్రజ్యోతి): గోవాలోని అర్పోరాలోని రోమియోలేన్‌లో భారీ అగ్నిప్రమాదం ( Goa fire incident) జరిగింది. బిర్చ్ నైట్ క్లబ్‌లో సిలిండర్ పేలి 23 మంది మృతి చెందారు. మృతులంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. ఈ ఘటనపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించారు ప్రధాని మోదీ. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రధాని ఓ ప్రకటన విడుదల చేశారు.
నిబంధనలు పాటించకపోవడంతోనే అగ్నిప్రమాదం: సీఎం ప్రమోద్ సావంత్
ప్రమాద ఘటనా స్థలాన్ని గోవా సీఎం ప్రమోద్ సావంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. బిర్చ్ నైట్ క్లబ్‌లో భద్రతా నిబంధనలు పాటించకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని వివరించారు. అగ్నిప్రమాదంపై వివరణాత్మక దర్యాప్తు జరుపుతామని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం ప్రమోద్ సావంత్ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గోవాలో భారీ అగ్నిప్రమాదం.. 23 మంది మృతి..
ఇండిగో విమానాల రద్దు.. ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు సిద్ధం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి