Goa Fire Accident: గోవాలో భారీ అగ్నిప్రమాదం.. 23 మంది మృతి..
ABN , Publish Date - Dec 07 , 2025 | 05:52 AM
గోవాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బిర్చ్ నైట్ క్లబ్‌లో సిలిండర్ పేలి 23 మంది మృతి చెందారు. మృతులంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. గోవాలోని అర్పోరాలోని రోమియోలేన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఎం ప్రమోద్ సావంత్.. సంఘటన స్థలాన్ని పరిశీలించారు
గోవాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బిర్చ్ నైట్ క్లబ్‌లో సిలిండర్ పేలి 23 మంది మృతి చెందారు. మృతులంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. గోవాలోని అర్పోరాలోని రోమియోలేన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఎం ప్రమోద్ సావంత్.. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సీఎం మాట్లాడుతూ క్లబ్‌లో భద్రతా నిబంధనలు పాటించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాదంలో ముగ్గురు కాలిపోయి మృతి చెందగా.. మిగిలినవారు ఊపిరాడక చనిపోయారని తెలిపారు. అగ్నిప్రమాదంపై వివరణాత్మక దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
విమాన ఛార్జీల పెంపుపై కేంద్రం ఆగ్రహం..
ఇండిగో విమానాల రద్దు.. ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు సిద్ధం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి