Centre Warns Airlines: విమాన ఛార్జీల పెంపుపై కేంద్రం ఆగ్రహం..
ABN , Publish Date - Dec 06 , 2025 | 02:07 PM
దేశంలో ఇండిగో సంక్షోభం నేపథ్యంలో విమాన ఛార్జీలు ఇష్టానుసారంగా పెంచడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడకుండా జాగ్రత్త వహించాలని సూచించింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో విమాన టికెట్ల ధరల పెంపుపై కేంద్రం రంగంలోకి దిగింది. విమాన ఛార్జీలను పెంచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్ర విమానయాన శాఖ(Central Aviation Department). ఇండిగో(IndiGo) ఫ్లైట్స్ రద్దైన మార్గాల్లో ధరలను క్రమబద్ధీకరించాలని సూచించింది.
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం(IndiGo Crisis) నేపథ్యంలో.. కొన్ని విమానయాన సంస్థలు ఆసరాగా తీసుకోవడంతో టికెట్ ధరలకు రెక్కలొచ్చాయి. ఇలా ఇష్టానుసారంగా ధరలు పెంచడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విమానయాన శాఖ.. ఛార్జీలు పెంచితే ఊరుకునేది లేదని హెచ్చరించింది. ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడకుండా జాగ్రత్త వహించాలంది. కొత్తగా నిర్ణయించిన ఛార్జీలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది.
ఇవీ చదవండి: