Sonu Sood Supports IndiGo Staff: ఆ సిబ్బందిని గౌరవించండి ప్లీజ్: సోను సూద్
ABN , Publish Date - Dec 06 , 2025 | 10:20 AM
దేశవ్యాప్తంగా ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు ఆగ్రహానికి గురవుతుండటంతో.. నటుడు సోను సూద్ స్పందించారు. ఆ సిబ్బంది పట్ల వినయంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఇంటర్నెట్‌డెస్క్: భారత విమానయాన సంస్థ ఇండిగో సిబ్బంది(IndiGo Staff)కి ప్రముఖ నటుడు సోను సూద్(Sonu Sood) మద్దతుగా నిలిచారు. సిబ్బంది పట్ల దయతో వ్యవహరించాలని ఎక్స్ మీడియా వేదికగా పోస్ట్ చేశారాయన.
'విమానాలు రద్దవడం, ఆలస్యం కావడం వంటి సమస్యలు ప్రయాణికులకు నిరాశపరచడం బాధాకరం. కానీ, ఆ సమస్యల పరిష్కారం కోసం వారు చేస్తున్న కృషిని గుర్తుంచుకోండి. దయచేసి సిబ్బందిని గౌరవిస్తూ, వినయంగా ఉండండి. వారికి మద్దతిద్దాం' అని సోను సూద్ అన్నారు.
ఇటీవల దేశవ్యాప్తంగా.. ఇండిగో విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది (IndiGo Crisis). ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు(Passengers anger with IndiGo Staff). ఎయిర్‌పోర్టుల్లో ప్యాసింజర్లు అసహనానికి గురవుతూ సిబ్బందిపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఈ దృశ్యాలన్నీ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా నటుడు సోను సూద్ స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇవీ చదవండి:
భారత ఇంధన అవసరాలన్నీ తీరుస్తాం