Share News

Cop Burnt Alive in Karnataka: మంటల్లో చిక్కుకున్న కారు.. పోలీస్ ఆఫీసర్ సజీవ దహనం

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:39 PM

కర్ణాటకలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ కారులో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న పోలీస్ ఆఫీసర్ సజీవ దహనమయ్యారు.

Cop Burnt Alive in Karnataka: మంటల్లో చిక్కుకున్న కారు.. పోలీస్ ఆఫీసర్ సజీవ దహనం
Karnataka Police Inspector Burnt Alive After Car Hits Divider

ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది(Karnataka Accidnt). ఓ కారు.. డివైడర్‌ను ఢీకొట్టి మంటల్లో చిక్కుకున్న ఘటనలో అందులోని పోలీస్ అధికారి సజీవ దహనమయ్యారు. ధార్వాడ్ జిల్లాలోని అన్నిగేరి శివారులో ఈ ఘటన జరిగింది.


ప్రమాదం జరిగిందిలా..

కన్నడ రాష్ట్రంలోని హవేరి లోకాయుక్త కార్యాలయంలో పనిచేస్తున్న పి.సలీమత్ అనే పోలీస్ ఇన్‌స్పెక్టర్(Lokayuktha Police Inspector Salimath).. శుక్రవారం రాత్రి గడగ్ నుంచి హుబ్బళికి హ్యుందాయ్ ఐ20 కారులో ఆయన నివాసానికి బయల్దేరారు. ఇంతలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం అన్నిగేరి సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టింది(Car hits a divider). దీంతో కారులో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి(Cop Burnt alive). సమీపంలోని ప్రయాణికులు అప్రమత్తమై.. సలీమత్‌(Salimath)ను రక్షించేందుకు యత్నించారు. అయితే.. తేరుకునేలోపే అందులో ఉన్న పోలీస్ ఆఫీసర్ సజీవ దహనమయ్యారు.


స్థానికుల సమాచారంతో.. అగ్నిమాపక సిబ్బంది(Fire Officials) ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అనంతరం.. కాలిపోయిన సలీమత్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే దిశగా విశ్లేషిస్తున్నారు.


ఇవీ చదవండి:

సాక్షి యాజమాన్యంపై కేసు నమోదు

ఇండిగో సంక్షోభంపై సుప్రీంకోర్టులో పిటిషన్.. సీజేఐ నివాసంలో విచారణ.!

Updated Date - Dec 06 , 2025 | 03:08 PM