Share News

Case Filed Against Sakshi in Kurnool: సాక్షి యాజమాన్యంపై కేసు నమోదు

ABN , Publish Date - Dec 06 , 2025 | 11:31 AM

నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో సాక్షి యాజమాన్యంపై కేసు నమోదైంది. గత నెల 8న ప్రచురితమైన ఓ పత్రికా కథనం ఇందుకు కారణం. పత్రికా యాజమాన్యం, సిబ్బందిపై చర్యలు చేపట్టాలని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.

Case Filed Against Sakshi in Kurnool: సాక్షి యాజమాన్యంపై కేసు నమోదు
Case Filed Against Sakshi in Kurnool

కర్నూలు జిల్లా, డిసెంబర్ 06: నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో సాక్షి ఎడిటర్, యాజమాన్యంపై కేసు నమోదైంది(Case Filed against Sakshi). జిల్లా పరిధిలోని ఏ, బీ, సీ క్యాంపుల్లో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయడం మంత్రి టీజీ భరత్(Minister TG Bharat) నిర్ణయమా? లేక ప్రభుత్వ నిర్ణయమా? అంటూ నవంబర్ 8న సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమవడంపై ఫిర్యాదు చేశారు.


సాక్షి దినపత్రికలో పేర్కొన్న ఈ వ్యాఖ్యలు.. మంత్రి టీజీ భరత్ పరువుకు భంగం కలిగించేలా ఉండటం సహా ప్రజలు, ఉద్యోగులను రెచ్చగొట్టేలా ఉన్నాయని గణేశ్ సింగ్(Ganesh Singh) అనే న్యాయవాది రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌(Two Town Police Station)లో ఫిర్యాదు చేశారు. దీనిపై పత్రికా యాజమాన్యంతో పాటు సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు సీఐ నాగరాజు యాదవ్(CI Nagaraju Yadav) తెలిపారు.


ఇవీ చదవండి:

తమిళనాడులో రోడ్డు ప్రమాదం..ఏపీ వాసులు మృతి

16న టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం

Updated Date - Dec 06 , 2025 | 11:34 AM