16న టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
ABN , Publish Date - Dec 06 , 2025 | 01:48 AM
తిరుమలలో ఈనెల 16న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి సమావేశం జరుగనుంది.
తిరుమల, డిసెంబరు5(ఆంధ్రజ్యోతి): తిరుమలలో ఈనెల 16న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి సమావేశం జరుగనుంది. డిసెంబరు 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు పదిరోజుల పాటు జరుగనున్న వైకుంఠ ద్వార దర్శనాలపై చర్చ జరుగనుంది. అలాగే టీటీడీ కొనుగోళ్లపై కొన్ని నిర్ణయాలు తీసుకోన్నారు. జనవరి 25న జరుగనున్న రథసప్తమికి చేపట్టాల్సిన ఏర్పట్లపై కూడా చర్చించనున్నారు. బోర్డ్ సెల్ విభాగం అంజెండా అంశాలను సిద్ధం చేస్తోంది.