Road Accident: తమిళనాడులో రోడ్డు ప్రమాదం..ఏపీ వాసులు మృతి
ABN , Publish Date - Dec 06 , 2025 | 10:05 AM
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. ఏపీకి చెందిన వారు నలుగురు ఉన్నారు. శబరిమల నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
విజయనగరం, డిసెంబర్ 05: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా.. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరణించిన వారు కొరపకొత్తవలసకు చెందిన రామకృష్ణ, అప్పలనాయుడు, రాము, చంద్రరావులుగా గుర్తించారు. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనం తర్వాత రామేశ్వరం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది.
శనివారం ఉదయం కీళకరై ఈసీఆర్ వద్ద వీళ్లు ప్రయాణిస్తున్న కారును.. మరొక కారు వేగంగా వచ్చి బలంగా ఢీ కొట్టింది. మృతుల్లో నలుగురు ఏపీకి చెందినవారని తమిళనాడు పోలీసులు తెలిపారు. డ్రైవర్ ముస్తాక్ కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన వాళ్లకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. శబరిమల దర్శనం ముగించుకుని రామేశ్వరం.. అక్కడి నుంచి వస్తుండగా ఈ దుర్ఘటనలో ప్రాణాలు పోగొట్టుకున్నారని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: