Ganja Trade: భారీగా గంజాయి స్వాధీనం.. 30 మందికి పైగా అరెస్ట్
ABN , Publish Date - Dec 06 , 2025 | 08:53 AM
మత్తు మహమ్మారి నియంత్రణ, నిర్మూలనను కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో వైసీపీ పాలనలో బీజం పడిన గంజాయి సరఫరా, విక్రయాలు, వినియోగంపై పోలీసులు నిఘా పెంచారు. ఇందులో భాగంగా ఇటీవల మదనపల్లె ఏరియాలో దాడులు నిర్వహించి, సుమారు వంద మందిని పట్టుకోవడంతో చర్చనీయాంశమైంది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచే కాకుండా సరిహద్దు ప్రాంతమైన ఒరిస్సా నుంచి గంజాయి దిగుమతి అవుతోంది. తిరుపతి కేంద్రంగా మదనపల్లెకు సరఫరా చేస్తుండగా, ఇక్కడి నుంచి తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు ఏరియాలకు ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
మదనపల్లె, డిసెంబరు 5: ఒకప్పుడు గంజాయి సరఫరా, వినియోగం రెండూ పరిమితంగా, అందులోనూ రహస్యంగా ఉండేది. ఇటీవల విచ్చలవిడి అయిపోయింది. దీని మత్తులో యువత.. సహచరులు, స్నేహితులతో మాటల సందర్భంలో దాడులు, దౌర్జన్యాలకు కూడా దిగుతోంది. ఈ నేపథ్యంలో మత్తు మహమ్మారి నియంత్రణ, నిర్మూలనను కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీంతో వైసీపీ పాలనలో బీజం పడిన గంజాయి సరఫరా, విక్రయాలు, వినియోగంపై పోలీసులు నిఘా పెంచారు. ఇందులో భాగంగా ఇటీవల మదనపల్లె ఏరియాలో దాడులు నిర్వహించి, సుమారు వంద మందిని పట్టుకోవడంతో చర్చనీయాంశమైంది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచే కాకుండా సరిహద్దు ప్రాంతమైన ఒరిస్సా నుంచి గంజాయి దిగుమతి అవుతోంది. తిరుపతి కేంద్రంగా మదనపల్లెకు సరఫరా చేస్తుండగా, ఇక్కడి నుంచి తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు ఏరియాలకు ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో కొందరు యువత, పనులు లేకుండా ఖాళీగా ఉంటున్న ఆకతాయిలను గంజాయి సరఫరాలోకి దిగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
రైలు, పార్శిల్, ఇతర రవాణా వాహనాల్లో అందుకుంటున్న వ్యాపారులు, తాము ఎంపిక చేసుకున్న ఏజెంట్ల ద్వారా మిగిలిన ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు తెలిసిం ది. కొన్ని చోట్ల చిల్లర దుకాణాల్లో కూడా సిగరెట్లు, బీడీ చుట్టల్లో నింపి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని సైదాపేట, బెంగళూరు బస్టాండు, దక్నీపేట, ఇందిరానగర్, దేవళం వీధి, మోతీనగర్ పాటు నీరుగట్టువారిపల్లె, రామారావు కాలనీ, చీకల గుట్ట, శివాజీనగర్, బాలాజీనగర్, బసినికొండ, కొత్తయిండ్లు, బుగ్గకాలువ, ఈశ్వరమ్మ కాలనీ ఏరియాలు గంజాయి బ్యాచ్‌కు అడ్డాగా మారాయి.
అలాగే పట్టణ శివారు ప్రాంతాలైన కోళ్లలు, వైఎస్ఆర్ నగర్, అమ్మచెరువు మిట్ట, చంద్రా కాలనీ, బి.కె.వల్లె, రామాచార్లపల్లె, నక్కలదిన్నె, మదనపల్లె బైపాస్ రోడ్డు ఏరియాలలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తోంది. పోలీసులకు పట్టుబడిన వారిచ్చిన సమాచారం మేరకు.. సైదాపేటలో దాడులు చేస్తే, అక్కడ పట్టుబడిన కొందరు అనుమానితులపై దాడులకు తెగబడ్డారు. ఇది స్థానికంగా సంచలనం సృష్టించింది. అలాగే ఓ వ్యక్తి ఇటీవల బెంగళూరు నుంచి వచ్చి అర్ధరాత్రి బస్సు దిగి నడుచుకుంటూ ఇంటికెళ్తుండగా అటుగా వెళ్తున్న గంజాయి బ్యాచ్ లిఫ్ట్ పేరుతో బయటకు తీసుకెళ్లి దాడి చేశారు. అతడి వద్దనున్న బంగారు చైన్ లాక్కెళ్లారు.
మదనపల్లెతో పాటు కురబలకోట మండలం అంగళ్లు, ముదివేడు, బి.కొత్తకోట, ములకల చెరువు, వాల్మీకిపురం, కలకడ, చిన్నమండెం, పీలేరు, పుంగనూరు ఏరియాలలోని వ్యాపారులు అక్కడక్కడా ఏర్పాటు చేసుకున్న ఏజెంట్ల ద్వారా వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించా రు. ఇందులో భాగంగానే ఊరికొక్కరిని అదుపులోకి తీసుకోవడం, కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. మొదటగా గంజాయి పొగ పీలుస్తున్న యువతను అదుపులోకి తీసుకుని వారిచ్చిన సమాచారంతో విక్రయ ఏజెంట్లను, అక్కడి నుంచి వచ్చిన సమా చారంతో నిఘా వుంచి వ్యాపారులను అరెస్టు చేసిన ట్లు చెబుతున్నారు. ఇందులో జులాయిగా తిరిగే యువతతో పాటు కళాశాల, ఇంజనీరింగ్ విద్యార్థు లు కూడా పట్టుబడిన వారిలో ఉన్నారు. మదనప ల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గా ల్లో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన దాడుల్లో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
డెకాయ్ ఆపరేషన్‌తో గంజాయి కట్టడి..
మదనపల్లె డీఎస్పీ కె. మహేంద్ర మాట్లాడుతూ..' డకాయ్ ఆపరేషన్‌తో గంజాయి కట్టడి చేస్తున్నాం. సివిల్ డ్రైన్‌తో కస్టమర్‌గా గంజాయి వినియోగదారులు, విక్రేతల వద్దకు వెళ్లి సంప్రదిస్తున్నాం. వారి ద్వారా మూలాలు కనుగొని కేసులు నమోదు చేస్తున్నాం. ఈ క్రమంలో గతనెలలో సబ్ డివిజన్ పరిధిలో అయిదు పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి కట్టడిలో పెద్ద అచీవ్మెంట్ సాధించాం. అలాగే పాత నిందితులపై కూడా నిఘా పెట్టి, వారి ట్రాక్‌ను ఫాలో అవుతున్నాం. ఇలా నాలుగు మార్గాల్లో గంజాయి వినియోగం, విక్రయాలపై కొరడా ఝుళిపిస్తున్నాం' అన్నారు.
వందమందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో బెంగళూరు బస్టాండు సమీపంలోని సైదాపేటలో సామూహికంగా గంజాయి పీలుస్తుండగా, ఇటీవల 20 మందిని పట్టుకున్నారు. ఇలా నక్కలదిన్నె, బెంగళూరు రోడ్డు ఖాళీ ప్రదేశాల్లో మత్తులో ఉన్న యువత అదుపులో ఉన్నారు. ఇందులో భాగంగా విక్రేతలు, గంజాయి పాత నేరస్థులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపగా, గంజాయి పాజి టివ్ వచ్చిన వారిలో కొందరికి కౌన్సెలింగ్ ఇచ్చి పం పేయగా, మరికొందరి మైనర్లను చిత్తూరులోని రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇలాంటి వారు 20 మందికి పైగా మేజర్, మైనర్లు ఉన్నారు. అలాగే సామూహిక కేం ద్రాల్లో ఉన్న చాలా మంది యువతకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. మరోసారి పట్టుబడితే, చర్యలు కఠినంగా ఉంటాయని డీఎస్పీ మహేంద్రతో పాటు సీఐలు ఎస్.మహ్మద్రఫీ, ఎన్.రాజారెడ్డి, కళా వెంకటరమణ, సత్యనారాయణలు హెచ్చరించారు.
ఇవీ చదవండి: