Government Orders: కొత్త వైద్య కాలేజీల్లో ఏ,బీ,సీ కేటగిరీల్లో పీజీ సీట్లు
ABN , Publish Date - Dec 06 , 2025 | 06:42 AM
రాష్ట్రంలోని కొత్త మెడికల్ కాలేజీల్లో ఎన్‌ఎంసీ కేటాయించిన పీజీ సీట్లకు సంబంధించి ప్రభుత్వం విభజన చేసింది.
అమరావతి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కొత్త మెడికల్ కాలేజీల్లో ఎన్‌ఎంసీ కేటాయించిన పీజీ సీట్లకు సంబంధించి ప్రభుత్వం విభజన చేసింది. కాలేజీల వారిగా కేటాయించిన సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటా, 35 శాతం సెల్ఫ్ ఫైనాన్స్, 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా కింద విభజించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. దీనికి అనుగుణంగానే ఆయా కాలేజీల్లో ఈ ఏడాది సీట్లు భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ మేరకు.. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజీల అడ్మిషన్స్ నిబంధనలు-1997కు ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ సీట్లు మొత్తం ఏపీలోని విద్యార్థులతోనే భర్తీ చేయనున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు కౌన్సెలింగ్ తర్వాత మిగిలిపోతే వాటిని ఎలా భర్తీ చేయాలన్న దానిపై డీఎంఈ ప్రత్యేక నిబంధనలు ఇవ్వనున్నారు. కన్వీనర్ కోటా సీట్లు మాత్రం రిజర్వేషన్లకు అనుగుణంగా భర్తీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.