Share News

కూడలి కుదింపు వేగవంతం

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:59 AM

నగరంలోని గాయత్రి ఎస్టేట్‌ కూడలి కుదింపు పనులు వేగవంతం చేసినట్లు నగర పాలక కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ తెలిపారు. శుక్రవారం పనులను పరిశీలించారు

కూడలి కుదింపు వేగవంతం
పనులను పరిశీలిస్తున్న కమిషనర్‌ విశ్వనాథ్‌

కర్నూలు న్యూసిటీ, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): నగరంలోని గాయత్రి ఎస్టేట్‌ కూడలి కుదింపు పనులు వేగవంతం చేసినట్లు నగర పాలక కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ తెలిపారు. శుక్రవారం పనులను పరిశీలించారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకూ పెరిగిపోతోందని వీలైనంత వేగంగా పనులు చేస్తామన్నారు. రూ.28 లక్షలతో చేస్తున్నామని, మూడు వారాల్లో పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే రహదారుల విస్తరణ పననులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. రాజవిహర్‌ వైపు 15 అడుగులు, సి.క్యాంపు వెళ్ళే వైపు 9 అడుగులు తొలగిస్తున్నామని కమిషనర్‌ అన్నారు. డిప్యూటి కమిషనర్‌ సతీష్‌కుమార్‌రెడ్డి, ఎంఈ మనోహర్‌రెడ్డి, డీఈఈ పవన్‌కుమార్‌రెడ్డి, ప్రజారోగ్య అధికారి డా.నాగశివప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు

Updated Date - Dec 06 , 2025 | 12:59 AM