IndiGo Flight Cancellations: ఫ్లైట్స్ రద్దు.. ఇండిగో కీలక ప్రకటన
ABN , Publish Date - Dec 07 , 2025 | 03:43 PM
ఆదివారం 650 ఫ్లైట్‌లను రద్దు చేసినట్టు ఇండిగో సంస్థ తాజాగా తెలిపింది. ఇక క్యాన్సిలేషన్‌తో ఇబ్బంది పడ్డ వారికి రీఫండ్‌లు ఇవ్వడంపై దృష్టి పెట్టినట్టు తెలిపింది. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు సీఈఓ, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌తో కూడిన క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూపును కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇండిగో విమానాల రద్దు పర్వం కొనసాగుతోంది. ఆదివారం 650 ఫ్లైట్‌లను రద్దు చేసినట్టు సంస్థ ప్రకటించింది. దీంతో, విమానాశ్రయాల్లో అనేక మంది పడిగాపులు పడుతున్నారు. గత ఐదు రోజులుగా ఇండిగో విమానాలు రద్దవుతున్న విషయం తెలిసిందే. ఇక ఆదివారాలు సాధారణంగా సంస్థ సగటున 2,300 విమానాలను నడుపుతుంది. అయితే, నేడు మాత్రం 1,650 విమాన సర్వీసులు నడుపుతామని తెలిపింది. డిసెంబర్ 10 నాటికి పరిస్థితులు అదుపులోకి వస్తాయని కూడా పేర్కొంది. ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై విమానాశ్రయాల్లో ఇండిగో ఫ్లైట్‌లు ఎక్కువగా రద్దయ్యాయి (IndiGo Flight Cancellations Sunday).
ఇదిలా ఉంటే, ప్రయాణికులకు టిక్కెట్ డబ్బుల రీఫండ్‌పై కూడా సంస్థ కీలక ప్రకటన చేసింది. డబ్బులు తిరిగి ఇచ్చేందుకే తమ తొలి ప్రాధాన్యత అని పేర్కొంది. ఇక సమస్య పరిష్కారం కోసం సంస్థ సీఈఓ, బోర్డు సభ్యులతో ఓ క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూపును కూడా ఏర్పాటు చేసింది. విమాన సర్వీసుల పునరుద్ధరణ, సంక్షోభ నివారణపై ఈ గ్రూప్ దృష్టిపెట్టనుంది. ఇక ప్రయాణికులకు ఆదివారం సాయంత్రం 8 గంటల లోపు రిఫండ్‌లను జారీ చేయాలని డీజీసీఏ శనివారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
విమానాల రద్దుతో సతమతమవుతున్న ప్రయాణికుల సహాయార్థం ఇప్పటికే భారత రైల్వే ప్రత్యేక రైళ్లను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే అదనపు రైళ్లను ప్రవేశపెట్టింది. దిబ్రూగఢ్-న్యూఢిల్లీ, గువాహటి-హౌరా మధ్య సోమవారం ఈ రైలు సర్వీసులు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. వీటికి తోడుగా ఇప్పటికే అందుబాటులో ఉన్న 18 రైళ్లకు 20 అదనపు కోచ్‌లను జోడించామని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
సిద్ధూ మళ్లీ రాజకీయాల్లోకి.. అయితే ఒక కండిషన్
గోవా అగ్నిప్రమాద ఘటన.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి