Share News

Jaishankar Meets Putin: పుతిన్‌తో జైశంకర్‌ భేటీ.. అమెరికాకు గట్టి షాక్

ABN , Publish Date - Aug 21 , 2025 | 08:20 PM

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాస్కోలో సమావేశమయ్యారు. ఈ భేటీ భారత్-రష్యా సంబంధాల్లో మరింత బలాన్ని తీసుకురావడంలో కీలకంగా మారింది.

Jaishankar Meets Putin: పుతిన్‌తో జైశంకర్‌ భేటీ.. అమెరికాకు గట్టి షాక్
Jaishankar Meets Putin

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను (Jaishankar Meets Putin) కలిశారు. పుతిన్‌ను కలుసుకునే ముందు జైశంకర్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్‌తో విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ చర్చలు ప్రధానంగా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఎక్కువగా దృష్టి సారించాయి.


రెండు దేశాల మధ్య

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేయోద్దని ఒత్తిడి తెచ్చిన తర్వాత ఈ భేటీ జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్శన రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అందరూ ఆశిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలోని ప్రధాన సంబంధాలలో భారత్-రష్యా సంబంధాలు అత్యంత స్థిరమైనవని జైశంకర్ అన్నారు. అంతేకాదు, ఈ సంబంధాలు రాజకీయ సమన్వయం, నాయకత్వ సంప్రదింపులు, ప్రజల మధ్య సానుకూల భావనలతో నడుస్తున్నాయని చెప్పారు.


మూడు రోజల టూర్..

మూడురోజుల పర్యటనలో భాగంగా జైశంకర్ మాస్కోకి మంగళవారం చేరుకున్నారు. ఈ పర్యటనలో పలు ముఖ్యమైన సమావేశాలు జరిగాయి. ప్రధానంగా భారత్-రష్యా మధ్య 26వ అంతర్-సర్కారీ కమిషన్ సమావేశానికి (IRIGC-TEC) జైశంకర్ ఉమ్మడిగా అధ్యక్షత వహించారు. అలాగే, మాస్కోలో జరిగిన ఇండియా-రష్యా బిజినెస్ ఫోరంలో జైశంకర్ ప్రసంగించారు.

భారత్, రష్యా రెండూ కలిసి తమ వాణిజ్య సంబంధాలను సమతుల్యంగా, స్థిరంగా విస్తరించాలని నిర్ణయించాయని జైశంకర్ అన్నారు. వాణిజ్యంలో అడ్డంకులైన నాన్-టారిఫ్ బ్యారియర్స్, రెగ్యులేటరీ హర్డిల్స్‌ను తొలగించడం ఎంత ముఖ్యమో వివరించారు. ఇలాంటి అడ్డంకులు తొలగితే, రెండు దేశాల మధ్య వ్యాపారం మరింత సులభతరం కానుంది.


అమెరికాకు షాక్..

ఈ సమావేశాలు, చర్చలు భారత్-రష్యా సంబంధాలు ఎంత ఎంత స్థిరంగా ఉన్నాయో మరోసారి నిరూపించాయి. రాజకీయాలు, ఆర్థిక సహకారం, సాంస్కృతిక బంధాలు కలిసి ఈ రెండు దేశాలను ఒకదానితో ఒకటి బలంగా అనుసంధానం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో పుతిన్ భారత సందర్శనతో ఈ సంబంధాలు మరింత బలపడనున్నాయి. కానీ ఈ చర్చలు అమెరికాకు గట్టి షాక్ అని చెప్పవచ్చు. ట్రంప్ ఇండియాను దెబ్బ కొట్టాలని చూస్తే, చివరకు అమెరికాకు నష్టం వాటిల్లేలా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 21 , 2025 | 08:40 PM