ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Election commission: పోలింగ్ రోజు పర్యటన.. బెంగాల్ గవర్నర్‌కు ఈసీ బ్రేక్..

ABN, Publish Date - Apr 17 , 2024 | 07:56 PM

పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌ పర్యటనకు ఎన్నికల కమిషన్ బుధవారంనాడు బ్రేక్ వేసింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ రోజు కూచ్‌బెహర్‌‌లో గవర్నర్ తలపెట్టిన పర్యటనను ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది.

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ (CV Ananda Bose) పర్యటనకు ఎన్నికల కమిషన్ (Election commission) బుధవారంనాడు బ్రేక్ వేసింది. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) పోలింగ్ రోజు కూచ్‌బెహర్‌ (Cooch Behar)లో గవర్నర్ తలపెట్టిన పర్యటనను ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది.


కూచ్ బెహర్‌లో ఈనెల 19న పోలింగ్ జరుగనుండగా, 48 గంటల 'సైలెంట్ పీరియడ్' బుధవారం సాయంత్రం నుంచి అమల్లోకి వచ్చింది. ఈనెల 18,19 తేదీల్లో కూచ్‌బెహర్‌లో గవర్నర్ పర్యటించనున్నారనే సమాచారం తమకు అందిందని, 19న ఎన్నికలు ఉండటంతో సైలెంట్ పీరియడ్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల కమిషన్ తెలిపింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదిత పర్యటనను గవర్నర్ చేపట్టరాదని తెలిపింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం, గవర్నర్ ఎలాంటి లోకల్ ప్రోగ్రామ్స్ నిర్వహించరాదని గవర్నర్ కార్యాలయానికి పంపిన సమాచారంలో ఈసీ స్పష్టం చేసింది. ఏప్రిల్ 18,19 తేదీల్లో మొత్తం జిల్లా యంత్రాంగం, పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లోనే ఉంటారని తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 126 ప్రకారం కూచ్ బెహర్‌లో 'సైలెన్స్ పీరియడ్' బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలిపింది.

జాతీయ వార్తలు కోసం..

Updated Date - Apr 17 , 2024 | 07:56 PM

Advertising
Advertising