ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : 16 రాష్ట్రాల సీఎస్‌లకు సుప్రీం కోర్టు సమన్లు

ABN, Publish Date - Jul 12 , 2024 | 05:29 AM

న్యాయాధికారుల పెన్షన్లు, ఇతర రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలకు సంబంధించిన అంశంలో సీఎ్‌సలు, ఆర్థిక శాఖ కార్యదర్శులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

జాబితాలో ఏపీ, తమిళనాడు, బెంగాల్‌, ఢిల్లీ తదితర రాష్ట్రాలు

న్యూఢిల్లీ, జూలై 11: న్యాయాధికారుల పెన్షన్లు, ఇతర రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలకు సంబంధించిన అంశంలో సీఎ్‌సలు, ఆర్థిక శాఖ కార్యదర్శులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. రెండో జాతీయ జ్యుడీషియల్‌ పే కమిషన్‌ సిఫారసు(ఎ్‌సఎన్‌జేపీసీ)లను అమలు చేయనందున 16 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక శాఖ కార్యదర్శులు తమ ఎదుట హాజరు కావాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది.

ఎస్‌ఎన్‌జేపీసీ సిఫారసులను అమలు చేయాలంటూ ఇప్పటికే ఏడుసార్లు ఆదేశాలిచ్చామని, ఆగస్టు 20 నాటికి ఎస్‌ఎన్‌జేపీసీ సిఫారసులను అమలు చేసి 23వ తేదీన న్యాయస్థానం ఎదుట ఆ అధికారులు హాజరుకావాలని, ఈ ఆదేశాలను అమలు చేయకుంటే కోర్టు ధిక్కరణ కింద పరిగణిస్తామని పేర్కొంది. ఈజాబితాలో ఏపీ, పశ్చిమబెంగాల్‌, చత్తీ్‌సగఢ్‌, ఢిల్లీ, అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలండ్‌, మిజోరాం, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళ, మేఘాలయ, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, మణిపూర్‌, ఒడిసా, రాజస్థాన్‌ సీఎస్‌లు, ఆర్థిక శాఖా కార్యదర్శులు ఉన్నారు.

Updated Date - Jul 12 , 2024 | 05:29 AM

Advertising
Advertising
<