ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

న్యూఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కీలక భేటీ

ABN, Publish Date - Apr 01 , 2024 | 05:30 PM

లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో బీహార్, ఒడిశా రాష్ట్రాల్లోని లోక్‌సభ అభ్యర్థుల తుది ఎంపికపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఆ క్రమంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) న్యూఢిల్లీలో సమావేశమైంది.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో బీహార్, ఒడిశా రాష్ట్రాల్లోని లోక్‌సభ ( Loksabha elections 2024) అభ్యర్థుల తుది ఎంపికపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఆ క్రమంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (The Congress Central Election Committee) (సీఈసీ) న్యూఢిల్లీలో సమావేశమైంది. అందులోభాగంగా బీహార్‌లోని కిషన్‌గంజ్ ఎంపీ అభ్యర్థిగా మహమ్మద్ జావిద్, కతిహర్ ఎంపీ అభ్యర్థిగా తారిక్ అన్వర్‌ను ఎంపిక చేసింది. కిషన్ గంజ్ ఎంపీగా ప్రస్తుతం జావిద్ ఉన్నారు.

తిరిగి ఆయనకే ఆ స్థానాన్ని పార్టీ అధిష్టానం కేటాయించింది. కిషన్‌గంజ్ (Kishanganj), కతిహర్ ( Katihar). ఈ రెండు నియోజకవర్గాలు పక్కపక్కనే ఉన్నాయి. అయితే బీహార్‌లో అత్యధిక ముస్లింల ఉన్న లోక్ సభ నియోజకవర్గంగా కిషన్‌గంజ్. మరోవైపు 2014లో కతిహర్ ఎంపీగా తారిక్ అన్వర్ (Tariq Anwar )ఎన్సీపీ (NCP) టికెట్‌పై విజయం సాధించగా... 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అలాంటి నేపథ్యంలో తారిక్ అన్వర్ మరోసారి ఈ నియోజకవర్గం నుంచి బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. మరోవైపు బాగల్‌పూర్ ఎంపీ టికెట్ ఇంత వరకు ఎవరికీ కేటాయించలేదు. ఆ స్థానానికి అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ఒకటి రెండు రోజుల్లో పూర్తి కానుందని సమాచారం.

ఇక కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కూటమిలో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) ఈ కూటమిలోని పార్టీలు. ఇక ఈ కూటమిలోని పార్టీలు సీట్లు పంచుకోవడంతో.. ఆర్జేడీ 26 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 9 సీట్లు, సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) ఒకొక్కటి చొప్పున ఈ మూడు పార్టీలు మూడు సీట్లు తీసుకున్నాయి.

ఇక సీఈసీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ ఎంపీ సోనియా గాంధీతోపాటు ఆ పార్టీ కీలక నేతలు హాజరయ్యారు. అలాగే లోక్‌సభ ఎన్నికలతోపాటు ఒడిశా అసెంబ్లీకి సైతం ఎన్నికలు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోఆ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సీఈసీ సమావేశంలో కసరత్తు చేపట్టిందీ

Updated Date - Apr 01 , 2024 | 05:49 PM

Advertising
Advertising