ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Suvendhu Adhikari: మేము అధికారంలోకి వస్తే మమతకు కటకటాలే

ABN, Publish Date - Dec 31 , 2024 | 08:41 PM

మహిళలపై తప్పుడు కేసులు పెట్టినందుకు టీఎంసీ చీఫ్‌ను జైలుకు పంపుతామని. చట్ట ప్రకారం ప్రతీకారం తీర్చుకుంటామని సువేందు అధికారి అన్నారు.

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే సందేశ్ ఖాలీ (Sandesh Khali)లో జరిగిన అకృత్యాలపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసి తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ (Mamata Banerjee)ని జైలుకు పంపుతామని బీజేపీ నేత సువేందు అధికారి (Suvendu Adhikari) అన్నారు. మంగళవారంనాడు సందేశ్‌ఖాలీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జరిగిన దాన్ని మరిచిపోవాలని మమతా బెనర్జీ ప్రజలను కోరారని, అయితే సందేశ్‌ఖాలీ ఘటనను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని చెప్పారు.

Sandeep Dikshit: అతిషి, సంజయ్ సింగ్‌‌పై రూ.10 కోట్ల పరువునష్టం దావా


''మహిళలపై తప్పుడు కేసులు పెట్టినందుకు మిమ్మల్ని (మమత) కూడా జైలుకు పంపుతాం. చట్ట ప్రకారం ప్రతీకారం తీర్చుకుంటాం. రాజ్యాంగ పరిమితులకు లోబడే వ్యవహరిస్తాం'' అని సువేందు అధికారి అన్నారు. షాజహాన్ షేక్ వంటి స్థానికి టీఎంసీ వ్యక్తులకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకే 2024 ఎన్నికలకు ముందు ఆ ప్రాంతంలోని మహిళలపై తప్పుడు కేసులు పెట్టారని, సీఎంకు చెందిన గూండాలు, రాష్ట్ర పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు.


ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నార్త్ 24 పరిగణాల జిల్లాలో సోమవారంనాడు పర్యటించారు. సందేశ్‌ఖాలీ ఘటనల అనంతరం ఆ ప్రాంతంలో తొలిసారి పర్యటించిన మమతా బెనర్జీ... ఇక్కడి ఆందోళన వెనుక ఒక పెద్ద గేమ్ నడిచిందని, డబ్బులు కుమ్మరించారని, ప్రజలు అసలు నిజం గ్రహించారని అన్నారు. జరిగినదాన్ని మరిచిపోయి ముందుకు వెళ్తామని ప్రజలకు సూచించారు.


ఇవి కూడా చదవండి..

CM MK Stalin : కన్యాకుమారిలో అద్దాల వంతెన

‘మహా’ కుంభమేళా!

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 31 , 2024 | 08:46 PM