Kerala: వయనాడ్ నుంచి రాహుల్‌తో తలపడే బీజేపీ అభ్యర్థి ఎవరంటే?
ABN, Publish Date - Mar 25 , 2024 | 11:40 AM
కాంగ్రెస్ అగ్రనేత పోటీ చేసే కేరళలోని వయనాడ్ ఎంపీ నియోజకవర్గంలో బీజేపీ నుంచే పోటీ చేసే నేత ఎవరనేదానిపై స్పష్టత వీడింది. వయనాడ్‌లో 2009 నుంచి కాంగ్రెస్ గెలుస్తు వస్తోంది. అలా కంచుకోటగా మారింది.
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత పోటీ చేసే కేరళలోని వయనాడ్ ఎంపీ నియోజకవర్గంలో బీజేపీ నుంచే పోటీ చేసే నేత ఎవరనేదానిపై స్పష్టత వీడింది. వయనాడ్‌లో 2009 నుంచి కాంగ్రెస్ గెలుస్తు వస్తోంది. అలా కంచుకోటగా మారింది. కొన్ని సార్లు ఇక్కడి నుంచి పోటీ చేసిన ప్రతిపక్ష పార్టీలు నామమాత్ర పోటీ ఇచ్చాయి. 2019లో తొలిసారి రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో అమేథీ సీటును కోల్పోయి.. వాయినాడ్ నుంచి రాహుల్ గెలుపొందారు.
2024 ఎన్నికల్లో రాహుల్ కి పోటీగా బీజేపీ ఎవరిని నిలుపుతుందనే దానిపై సందిగ్ధత వీడింది. కేరళ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కె.సురేంద్రన్ వయనాడ్ నుంచి రాహుల్‌తో పోటీ పడనున్నారు. ఈసారి కూడా అక్కడ త్రిముఖ పోరు ఉండనుంది. దక్షిణాదిలో కాంగ్రెస్, వామపక్షాలు ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ ఇండియా కూటమిలో సభ్యులుగా ఉన్నారు. 2020లో సురేంద్రన్ బీజేపీ కేరళ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
శబరిమలలో యువతుల ప్రవేశానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు నేతృత్వం వహించారు. కోజికోడ్‌కు చెందిన సురేంద్రన్ బీజేపీ 5వ అభ్యర్థుల జాబితాలో ఉన్నారు. ఇందులో నటి కంగనా రనౌత్, కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ పేర్లు కూడా ఉన్నాయి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 25 , 2024 | 11:43 AM