ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hardeep Singh Nijjar: భారతీయుల అరెస్ట్‌పై స్పందించిన ట్రూడో.. ఏమన్నారంటే

ABN, Publish Date - May 05 , 2024 | 11:21 AM

ఖలిస్తానీ తీవ్రవాదీ హర్దిప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్య కేసులో శనివారం కెనడా పోలీసులు ముగ్గురు నిందితులను(భారతీయులు) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trueau) స్పందించారు. తమ పౌరులకు భద్రత కల్పించే విషయంలో రాజీ పడబోమని ఆయన అన్నారు.

ఒట్టావా: ఖలిస్తానీ తీవ్రవాదీ హర్దిప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్య కేసులో శనివారం కెనడా పోలీసులు ముగ్గురు నిందితులను(భారతీయులు) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trueau) స్పందించారు. తమ పౌరులకు భద్రత కల్పించే విషయంలో రాజీ పడబోమని ఆయన అన్నారు. సిక్కు సంస్కృతి, వారసత్వాన్ని గుర్తుచేస్తూ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

‘‘కెనడాలో(Canada) చట్టబద్ధపాలన కొనసాగుతోంది. శక్తిమంతమైన, స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉంది. మా దేశ పౌరుల రక్షణకు కట్టుబడి ఉన్నాం. ఈ కేసుకు సంబంధించి ఇంకో కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. నిజ్జర్ హత్య తరువాత కెనడాలోని సిక్కు మతస్తులు అభద్రతకు లోనవుతున్నారు. వివక్ష, హింసకు తావులేకుండా స్వేచ్ఛగా జీవించడం ప్రతి పౌరుడి హక్కు’’ అని ట్రూడో అన్నారు.

Canada: హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు.. ముగ్గురు భారతీయులను అదుపులోకి తీసుకున్న కెనడా


జరిగిందిదే..

భారత్ మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్(45)ని 2023 జూన్ 18న కెనడా దేశం సర్రేలో ఉన్న గురుద్వారాలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆ దేశ అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో నిజ్జర్ హత్య వెనక భారత్ ప్రమేయం ఉందని ఆరోపించడంతో.. దానికి భారత్ కౌంటర్ ఇచ్చింది. ఇలా ఇరు దేశాల మధ్య ఘర్షణపూర్వక వాతావరణం నెలకొనడంతో దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

For Latest News and National News click here

Updated Date - May 05 , 2024 | 11:22 AM

Advertising
Advertising