Share News

Canada: హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు.. ముగ్గురు భారతీయులను అదుపులోకి తీసుకున్న కెనడా

ABN , Publish Date - May 04 , 2024 | 10:10 AM

ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్య కేసులో ముగ్గురు అనుమానితులను శుక్రవారం కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజ్జర్ హత్య కేసులో వీరంతా ఒక స్వ్కాడ్‌గా ఏర్పడి హత్యకు పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. రాయల్ కెనెడియన్ మౌంటెడ్ పోలీసులు(RCMP) నిందితుల పేర్లను వెల్లడించారు.

Canada: హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు.. ముగ్గురు  భారతీయులను అదుపులోకి తీసుకున్న కెనడా

కెనడా: ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్య కేసులో ముగ్గురు అనుమానితులను శుక్రవారం కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజ్జర్ హత్య కేసులో వీరంతా ఒక స్వ్కాడ్‌గా ఏర్పడి హత్యకు పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. రాయల్ కెనెడియన్ మౌంటెడ్ పోలీసులు(RCMP) నిందితుల పేర్లను వెల్లడించారు.

భారత్‌కు చెందిన కరణ్ ప్రీత్ సింగ్(28), కమల్ ప్రీత్ సింగ్(22), కరణ్ బ్రర్(22) ఉన్నారు. వారిని దర్యాప్తు సంస్థలు కొన్ని నెలల క్రితమే గుర్తించాయి. పకడ్బందీ ప్రణాళికతో అదుపులోకి తీసుకున్నాయి. ఆర్సీఎంపీ సూపరింటెండెంట్ మన్దీప్ మూకర్ మాట్లాడుతూ.. "నిందితులకు భారత ప్రభుత్వంతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం" అని అన్నారు.


నిజ్జర్ హత్య కోసం వీరిలో ఒకరు షూటర్‌గా, ఇంకొకరు డ్రైవర్‌గా, మరొకరు స్పాటర్‌గా వ్యవహరించి ప్రణాళిక ప్రకారమే హత్య చేశారని కెనడా పోలీసులు ఆరోపిస్తున్నారు. రెండు ప్రావిన్సులలో విస్తృతంగా తనిఖీ చేపట్టాక నిందితులను అరెస్ట్ చేశామన్నారు. కేసు దర్యాప్తు కోసం అమెరికా లా ఎన్‌ఫోర్స్‌‌మెంట్ ఏజెన్సీలతో కలిసి పని చేసినట్లు కెనెడియన్ పోలీసులు తెలిపారు.

రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు జరుగుతాయని అన్నారు. "నిజ్జర్ హత్య కేసు దర్యాప్తు ఇక్కడితో ఆగదు. హర్దీప్ హత్య వెనక ఇంకా చాలా మంది ఉన్నట్లు మాకు సమాచారం ఉంది. నిందితులందర్ని అరెస్ట్ చేస్తాం" అని ఆర్సీఎంపీ అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్ అన్నారు.


భారత్ మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్(45)ని 2023 జూన్ 18న కెనడా దేశం సర్రేలో ఉన్న గురుద్వారాలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆ దేశ అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో నిజ్జర్ హత్య వెనక భారత్ ప్రమేయం ఉందని ఆరోపించడంతో.. దానికి భారత్ కౌంటర్ ఇచ్చింది. ఇలా ఇరు దేశాల మధ్య ఘర్షణపూర్వక వాతావరణం నెలకొనడంతో దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

For Latest News and National News click here

Updated Date - May 04 , 2024 | 10:30 AM