ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Wheat: గోధుమలతో ఇన్ని లాభాలా.. తెలుసుకుంటే వదిలిపెట్టరు

ABN, Publish Date - Apr 15 , 2024 | 11:10 AM

గోధుమలు(Cereal Grain).. వీటిని ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. జొన్న రొట్టెలను ఇష్టపడని వ్యక్తులు ఉంటారేమో గానీ.. గోధుమ పిండితో చేసే తిండి పదార్థాలను ఇష్టపడని వారుండరు. పోషకాలపరంగా గోధుమలు ప్రథమ స్థానంలో నిలుస్తాయి.

ఇంటర్నెట్ డెస్క్: గోధుమలు(Cereal Grain).. వీటిని ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. జొన్న రొట్టెలను ఇష్టపడని వ్యక్తులు ఉంటారేమో గానీ.. గోధుమ పిండితో చేసే తిండి పదార్థాలను ఇష్టపడని వారుండరు. పోషకాలపరంగా గోధుమలు ప్రథమ స్థానంలో నిలుస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది తమ ఆహారంలో గోధుమలను తరచూ వాడతారు. శరీరానికి ఉపయోగపడే పోషకాలు ఎన్నో గోధుమల్లో ఉన్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పొందేందుకు వాటిని ఆహారంలో చేర్చుకోవచ్చు. గోధుమలతో ఓనగూరే 5 ప్రయోజనాలు తెలుసుకుందాం.

పోషకాలు అధికం..

గోధుమల్లో చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లలో సమృద్ధిగా ఉంటాయి. గోధుమ పిండి శరీరానికి శక్తినిస్తుంది. గోధుమలు ఫోలేట్, థయామిన్, నియాసిన్ వంటి విటమిన్లతో పాటు ఇనుము, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, ఎర్ర రక్త కణాలను పెంపొందించడానికి ఉపయోగపడతాయి.

Delhi: భారతీయుల రక్షణ మా మొదటి ప్రాధాన్యత.. ఇరాన్ - ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ మోదీ స్పష్టీకరణ

జీర్ణశక్తికి..

గోధుమల్లో ఉండే ప్రధానమైన పోషకం డైటరీ ఫైబర్. ఇది జీర్ణ వ్యవస్థను కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తుంది. పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్‌తో సహా కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

గుండె ఆరోగ్యం..

సంతులిత ఆహారంలో భాగంగా గోధుమలను తీసుకోవడం వల్ల అనేక గుండె సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇవి యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్, ఫైబర్ వంటి సమ్మేళనాలను కలిగి ఉంటాయి. హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గోధుమ ఉత్పత్తులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉండటం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.


Delhi: ఫెయిర్‌నెస్ క్రీములు వాడుతున్నారా.. అయితే మీ కిడ్నీలు పోయినట్లే

బరువు నియంత్రణ..

బరువు నియంత్రణలో ఉండాలనుకునే వారు గోధుమలను క్రమం తప్పకుండా తమ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వీటిల్లో అధికంగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. శరీరానికి అవసరమైనంత మేరకే కేలరీలు అందిస్తుంది. గోధుమలతో రుచికరమైన, పోషకమైన భోజనాన్ని ఆస్వాదిస్తూనే మీ బరువును నియంత్రించవచ్చు.

బ్రెయిన్ బూస్టింగ్ ప్రాపర్టీస్..

గోధుమలు మెదడు ఆరోగ్యానికి, అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఇందులో ఉండే ఫోలేట్, థయామిన్, నియాసిన్ వంటి విటమిన్లు న్యూరోట్రాన్స్మిటర్ సంశ్లేషణ, నరాల పనితీరులో కీలక పాత్ర పోషిస్తాయి. మెదడు ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. మానసిక శక్తి, ఏకాగ్రత పెంపొందడంలో సాయం చేస్తాయి. చురుకైన మెదడు కోసం గోధుమలను నిత్యం ఆహారంలో చేర్చుకోవడమూ ముఖ్యమే.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 15 , 2024 | 11:12 AM

Advertising
Advertising