Onion: ఉల్లిపాయ తింటే శరీరంలో ఆ రెండు అవయవాలు సేఫ్.. ఇంతకీ అవేంటంటే..!
ABN, Publish Date - Apr 04 , 2024 | 04:08 PM
ఉల్లిపాయలో బయోయాక్టివ్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఆ రెండు అవయవాల ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి.
ఉల్లిపాయ లేకుండా చాలామంది వంటను కూడా ఊహించలేరు. వంటకు రుచిని, వాసనను ఇచ్చి వంట రుచి పెరిగేలా చేయడంలో ఉల్లిపాయ ఎప్పుడూ ముందు ఉంటుంది. ఉల్లిపాయలో బయోయాక్టివ్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో కొన్ని అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా ఉల్లిపాయలో ఉండే జింక్, సల్ఫర్ సమ్మేళనాలు శరీరానికి చాలా ఉపయోగపడతాయి. ఉల్లిపాయలు తినడం వల్ల శరీరంలో రెండు అవయవాలు చాలా సేఫ్ గా ఉంటాయి. ఇంతకీ అవేంటో తెలుసుకుంటే..
లివర్..
లివర్ ను కాలేయం అని కూడా అంటారు. ఉల్లిపాయ తినడం వల్ల కాలేయానికి మంచిది. కాలేయ కణాల పనితీరును వేగవంతం చేస్తుంది. ఉల్లిపాయలో అధికమొత్తంలో ఉండే సల్ఫర్ కాలేయ కణాలలో మంటను తగ్గిస్తుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఫ్యాటీ లివర్ సమస్యను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు కొవ్వు లిపిడ్‌లను తగ్గించి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
ఇది కూడా చదవండి: ఫేస్ వాష్ ను రోజులో ఏ సమయంలో, ఎన్ని సార్లు ఉపయోగిస్తే బెస్టో తెలుసా?
చిన్న ప్రేగు..
చిన్న ప్రేగు సమస్యలను తగ్గించడంలో ఉల్లిపాయల వినియోగం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ప్రీబయోటిక్స్ లాగా పనిచేస్తుంది. ఇవి గట్ మైక్రోఫ్లోరాకు ఆహారంగా ఉపయోగపడే ఆహారాలు. చిన్న ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించడానికి ప్రీబయోటిక్స్ దోహదం పనిచేస్తుంది. ఇది ప్రేగుల పనితీరును మెరుగుపరుస్తుంది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఉల్లిపాయను తినేటప్పుడు అది ఫ్రక్టాన్స్‌గా పనిచేస్తుంది. ఇది ప్రేగు కార్యకలాపాలను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి కాలేయం, చిన్నప్రేగు రెండూ ఆరోగ్యంగా ఉండాలంటే ఉల్లిపాయను తినాలి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Apr 04 , 2024 | 04:08 PM