Energy Drinks: ఎనర్జీ డ్రింక్ తాగే అలవాటుందా? డాక్టర్లు చెబుతున్న నిజాలివీ..!
ABN, Publish Date - Jan 22 , 2024 | 11:41 AM
శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడే ఎనర్జీ డ్రింక్స్ గూర్చి వైద్యులు వెల్లడించిన నిజాలివీ..
ఎనర్జీ డ్రింక్స్ తాగితే రోజంతా శక్తివంతంగా ఉంటామని అనుకుంటారు. పని మీద ఏకాగ్రత పెంచడంలోనూ, రోజంతా చురుగ్గా ఉండటంలోనూ ఎనర్జీ డ్రింక్స్ సహాయపడతాయి. అందుకే అన్ని వయసులవారు వీటిని తీసుకోవడానికి ఇష్టపడతారు. వీటి రుచి వీటిని తాగేందుకు ఇష్టపడేలా చేసే మరొక కారణం కూడా. అయితే ఎనర్జీ డ్రింక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. అసలు ఎనర్జీ డ్రింక్స్ తాగడం మంచిదేనా? ఇవి తాగితే ఏం జరుగుతుంది తెలుసుకుంటే..
ఎనర్జీ డ్రింక్స్ శరీరాన్ని శక్తివంతంగా ఉంచినా కొన్నిసార్లు ఆరోగ్యం మీద తీవ్ర దుష్ప్రభావాలు కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: పిల్లలలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివీ..!
ఎనర్జీ డ్రింక్స్ తాగితే నిద్ర విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి, మెదడుపై ప్రభావం ఇవన్నీ కలిసి డిప్రెషన్‌కు దారితీసినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.
పిల్లలు ఎనర్జీ డ్రింక్స్ తాగితే అది వారి చదువు మీద చాలా ప్రభావం చూపిస్తుంది. మానసిక రుగ్మతలు, యాంగ్జయిటీ, చదువులో రాణించలేకపోవడం, చదువు పట్ల అనాసక్తి వంటి సమస్యలు పిల్లలలో కనిపించొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: jaggery: తాజా బెల్లం, పాత బెల్లం.. రెండింటిలో ఏది బెస్ట్? ఆయుర్వేదం ఏం చెప్పిందంటే..!
ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తీసుకునేవారు తాము చురుగ్గా ఉంటున్నామని, ఆరోగ్య పరంగా ఫిట్ గా ఉంటామని అనుకుంటారు. కానీ ఇవి గుండెకు చేటు చేస్తాయి. ఎక్కువగా ఎనర్జీ డ్రింక్స్ తాగితే శరీరం తొందరగా డీహైడ్రేట్ అవుతుంది. రక్తపోటు, ఆందోళనను పెంచుతుంది.
ఇది కూడా చదవండి: Hair Growth: ఏం చేసినా జుట్టు పెరగట్లేదా? ఇవి తినండి చాలు..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jan 22 , 2024 | 12:03 PM