Share News

jaggery: తాజా బెల్లం, పాత బెల్లం.. రెండింటిలో ఏది బెస్ట్? ఆయుర్వేదం ఏం చెప్పిందంటే..!

ABN , Publish Date - Jan 21 , 2024 | 05:16 PM

బెల్లంలో కూడా కొత్త బెల్లం, పాత బెల్లం అని రెండు రకాలున్నాయి. వీటి గురించి ఆయర్వేదం చెప్పిన నిజాలివీ..

jaggery: తాజా బెల్లం,  పాత బెల్లం.. రెండింటిలో ఏది  బెస్ట్? ఆయుర్వేదం ఏం చెప్పిందంటే..!

కొత్తబెల్లం, పాతబెల్లం అని వింటూ ఉంటాము. ముఖ్యంగా సంక్రాంతి పండుగ నాటికి చెరకు కోత పూర్తయ్యి ఆ చెరక రసంతో తాజాగా బెల్లం తాయరై ఉంటుంది. దీన్ని కొత్త బెల్లం అని అంటారు. ఇక తయారుచేసిన తరువాత ఏళ్ల కొద్ది నిల్వ ఉంచితే దాన్ని పాత బెల్లం అంటారు. బాగా గమనిస్తే పాత బెల్లం కాస్త వాసన కూడా వేరుగా ఉంటుంది. సాధారణంగా పంచదార కంటే బెల్లం ఆరోగ్యానికి మంచిదని అంటుంటారు. కానీ బెల్లంలో కూడా కొత్త బెల్లం, పాత బెల్లం అని రెండు రకాలున్నాయి. వీటిలో కొత్త బెల్లం కంటే పాత బెల్లం ఆరోగ్యాకి చాలామంచిదని ఆయిర్వేదం చెబుతోంది. అసలు పాత బెల్లం ఎందుకు మంచిది? దీన్ని ఎన్నేళ్లు నిల్వ ఉంచుతారు? పూర్తీగా తెలుసుకుంటే..

ఆయుర్వేద వైద్యుల ప్రకారం 1 నుండి 2 సంవత్సరాల వయస్సు గల బెల్లాన్ని పాత బెల్లం అంటారు. అంటే బెల్లం తయారైన తరువాత సుమారు రెండేళ్లు నిల్వ ఉంచుతారు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎక్కువకాలం నిల్వ చేయడం వల్ల బెల్లంలో యాంటీఆక్సిడెంట్లు, పోషక విలువలు పెరుగుతాయి.

ఇది కూడా చదవండి: Hair Growth: ఏం చేసినా జుట్టు పెరగట్లేదా? ఇవి తినండి చాలు..!



పాత బెల్లం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల, 1 నుండి 2 సంవత్సరాలు నిల్వ ఉంచిన పాత బెల్లం తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.

శరీరానికి శక్తినిచ్చే బోలెడు పోషకాలు బెల్లంలో ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, ఐరన్, మెగ్నీషియం వంటి మూలకాలు బెల్లంలో పుష్కలంగా లభిస్తాయి. అంతే కాదు బెల్లంలో అనేక రకాల ఎంజైమ్‌లు మరియు ఫైబర్‌లు ఉంటాయి, ఇది ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది.

ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైన కాల్షియం, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన పోషకాలు బెల్లంలో ఉంటాయి. అందుకే పెద్దలు రోజూ ఓ చిన్న ముక్క బెల్లం తినమని సలహా ఇస్తుంటారు.

ఇది కూడా చదవండి: Raw Coconut: చలికాలంలో పచ్చికొబ్బరి తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..!


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 21 , 2024 | 05:16 PM