ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Apple Cider vinegar: యాపిల్ సైడర్ వెనిగర్ తాగేవారికి బిగ్ అలెర్ట్.. ఈ 5 విషయాలు తెలుసుకోకపోతే నష్టపోతారు..!

ABN, Publish Date - May 28 , 2024 | 03:52 PM

ఆరోగ్య స్పృహ పెరిగిన కారణంగా ఈ మధ్యకాలంలో చాలా రకాల పానీయాలు, ఆహార పదార్థాలు విరివిగా వాడుతున్నారు. అలాంటి వాటిలో యాపిల్ సైడర్ వెనిగర్ కూడా ఒకటి. బరువు తగ్గడానికి, జీవక్రియ పెంచడానికి.. ఇతర ఆరోగ్య ప్రయోజనాల కోసం యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటూ ఉంటారు. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ గురించి చాలామందికి కొన్ని నిజాలు తెలియవు..

ఆరోగ్య స్పృహ పెరిగిన కారణంగా ఈ మధ్యకాలంలో చాలా రకాల పానీయాలు, ఆహార పదార్థాలు విరివిగా వాడుతున్నారు. అలాంటి వాటిలో యాపిల్ సైడర్ వెనిగర్ కూడా ఒకటి. బరువు తగ్గడానికి, జీవక్రియ పెంచడానికి.. ఇతర ఆరోగ్య ప్రయోజనాల కోసం యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటూ ఉంటారు. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ గురించి చాలామందికి కొన్ని నిజాలు తెలియవు. ముఖ్యంగా 5 విషయాలు తెలుసుకోకుండా యాపిల సైడర్ వెనిగర్ వాడితే చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుంటే..

యాపిల్ సైడర్ వెనిగర్ సరైన పరిమాణంలో తీసుకోవాలి. పెద్దలు సాధారణంగా ఒకటి నుండి రెండు టీస్పూన్ల వెనిగర్‌ను ఒక గ్లాసు నీటిలో కలిపి త్రాగాలి. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో చికాకు లేదా ఇతర సమస్యలు రావచ్చు.

ఈ 9 అలవాట్లు పిల్లలను మేధావులను చేస్తాయి..!


ఎల్లప్పుడూ నీటిలో కలిపిన తర్వాత మాత్రమే యాపిల్ సైడర్ వెనిగర్ త్రాగాలి. నేరుగా తాగడం వల్ల గొంతు, దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది. గొంతులో బొబ్బలు, పుండ్లు కూడా ఏర్పడవచ్చు.

ఉదయం పూట ఖాళీ కడుపుతో యాపిల్ సైడర్ వెనిగర్ తాగకూడదు. ఆహారం తీసుకున్న తర్వాత తీసుకోవడం మంచిది. ఖాళీ కడుపుతో దీన్ని తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి.

దంత ఆరోగ్యం కోసం స్ట్రా ఉపయోగించాలి. స్ట్రా తో తాగడం వల్ల పంటి ఎనామిల్ దెబ్బతినడం తగ్గుతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్ ను గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల దాని ప్రభావాన్ని మెరుగ్గా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూరుతుంది.

మీకు కోపం ఎక్కువా? అయితే ఇలా కంట్రోల్ చేసుకోండి..

ఈ 9 అలవాట్లు పిల్లలను మేధావులను చేస్తాయి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 28 , 2024 | 03:52 PM

Advertising
Advertising