ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: పట్టపగలు.. అపార్ట్‌మెంట్‌లో చోరీ..

ABN, Publish Date - Jul 31 , 2024 | 12:58 PM

నగరం నడిబొడ్డున గల ఓ అపార్ట్‌మెంట్‌(Apartment)లో పట్టపగలు ఫ్లాట్‌ తాళాలు పగులగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు 50 తులాల బంగారం, లక్ష రూపాయలు అపహరించుకుపోయారు. గాంధీనగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్‌ ఆస్పత్రి ఎదుటగల కృష్ణానగర్‌ కాలనీ(Krishnanagar Colony)లోగల భవానీ శ్రీ షీలా అవెన్యూ అపార్ట్‌మెంట్‌లోగల 303 ఫ్లాట్‌లో హెచ్‌డీఎ్‌ఫసీ ఉద్యోగి శ్రీనివాస్‌, భార్య సబిత, కుమార్తె అనుష్కతో కలిసి అద్దెకు ఉంటున్నారు.

- ఫ్లాట్‌ తాళాలు పగులగొట్టి 50 తులాల బంగారం, లక్ష రూపాయలు అపహరణ

హైదరాబాద్: నగరం నడిబొడ్డున గల ఓ అపార్ట్‌మెంట్‌(Apartment)లో పట్టపగలు ఫ్లాట్‌ తాళాలు పగులగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు 50 తులాల బంగారం, లక్ష రూపాయలు అపహరించుకుపోయారు. గాంధీనగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్‌ ఆస్పత్రి ఎదుటగల కృష్ణానగర్‌ కాలనీ(Krishnanagar Colony)లోగల భవానీ శ్రీ షీలా అవెన్యూ అపార్ట్‌మెంట్‌లోగల 303 ఫ్లాట్‌లో హెచ్‌డీఎ్‌ఫసీ ఉద్యోగి శ్రీనివాస్‌, భార్య సబిత, కుమార్తె అనుష్కతో కలిసి అద్దెకు ఉంటున్నారు. మంగళవారం ఉదయం శ్రీనివాస్‌ కార్యాలయానికి, కుమార్తె కాలేజీకి వెళ్లగా.. సబిత అనారోగ్యంగా ఉండడంతో పుట్టింటికి వెళ్లింది.

ఇదికూడా చదవండి: రిజిస్ట్రార్‌ పర్మిషన్‌.. ప్రిన్సిపాల్‌ క్యాన్సిలేషన్‌...


శ్రీనివాస్‌ కుమార్తె సాయంత్రం 6 గంటలకు ఇంటికి రాగా తలుపునకు వేసిన తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో వస్తువులు చిందరవందరగా పడేసి ఉన్నాయి. అనుష్క వెంటనే తండ్రి, తల్లికి ఫోన్‌ చేసి విషయం చెప్పి, డయల్‌ 100కు ఫోన్‌ చేసి తమ ఇంట్లో చోరీ జరిగిందని చెప్పింది. శ్రీనివాస్‌(Srinivas) వెంటనే ఇంటికి వచ్చి బీరువాలో భద్రపరిచిన 50 తులాల బంగారం, లక్ష రూపాయలు చోరీ అయ్యాయని గాంధీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


గాంధీనగర్‌ సబ్‌డివిజన్‌ ఏసీపీ మొగులయ్య, సీఐ డి రాజు పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. స్థానికంగాగల సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. అపార్ట్‌మెంట్‌కు ఎవరెవరు వచ్చారనే వివరాలు తెలుసుకున్నారు. తెలిసిన వారే చోరీ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 31 , 2024 | 12:58 PM

Advertising
Advertising
<