ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: పట్టపగలు బాలికపై కత్తితో దాడి చేసిన యువకుడు

ABN, Publish Date - Mar 24 , 2024 | 10:48 AM

ఓ యువకుడు పట్టపగలే దారుణానికి పాల్పడ్డాడు. ఓ బాలికపై ఏకంగా కత్తి(knife)తో దాడి(attack) చేశాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీ(delhi)లోని ముఖర్జీ నగర్‌(Mukherjee Nagar)లో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్ అవుతోంది.

ఓ యువకుడు పట్టపగలే దారుణానికి పాల్పడ్డాడు. ఓ బాలికపై ఏకంగా కత్తి(knife)తో దాడి(attack) చేశాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీ(delhi)లోని ముఖర్జీ నగర్‌(Mukherjee Nagar)లో చోటుచేసుకుంది. అయితే లైబ్రరీకి వెళ్తున్న బాలికపై 22 ఏళ్ల అమన్(Aman) అనే యువకుడు దాడి చేశాడు. ఈ ఘటన మార్చి 22న జరుగగా సమాచారం తెలుసుకున్న పోలీసులు(police) నిందితుడిని అరెస్ట్ చేసి, అక్కడి సీసీ కెమెరాలో రికార్డైన వీడియోను విడుదల చేశారు. వీడియోలో ఓ యువకుడు వేగంగా వచ్చి ఓ అమ్మాయిపై కత్తితో పలు మార్లు దాడి చేయడం కనిపించింది. ముఖర్జీ నగర్‌లోని ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోలో కనిపిస్తున్న యువకుడి పేరు అమన్(Aman) అని, ముఖర్జీ నగర్‌లో అక్కడక్కడ తిరుగుతుంటాడని చెబుతున్నారు. సమీపంలో నివసించే విద్యార్థులు నిందితుడిని పిచ్చివాడంటూ తరచూ ఎగతాళి చేసేవారని అన్నారు. ఆ క్రమంలోనే నిందితుడు దాడి చేసిన అమ్మాయి కూడా తనను ఎగతాళి చేసిందని ఆ అబ్బాయి చెబుతున్నాడు. ఘటన జరిగిన ప్రాంతంలోని లైబ్రరీలో చదువుకునేందుకు బాలిక(girl) వస్తుండేదని అతను అన్నాడు. ఓ జోక్(joke) కారణంగా నిందితుడు కోపోద్రిక్తుడై కూరగాయల వ్యాపారి నుంచి కత్తి(knife) తీసుకుని ఆమెపై దాడి చేశానని చెప్పాడని అధికారులు అంటున్నారు.


అయితే బాలికకు స్వల్ప గాయాలు(injured) కావడంతో ఆమె క్షేమంగా ఉంది. మరోవైపు యువకుడు దాడి చేస్తున్న క్రమంలో సమీపంలోని వ్యక్తులు(people) ఎందుకు ఆపడం లేదని పోలీసులు అంటున్నారు. ప్రేక్షకపాత్ర వహించడం వల్ల ఇలాంటివి ముప్పుగా తయారవుతున్నాయని వెల్లడించారు. దీనికి ఉదాహరణ ఢిల్లీలోని సాక్షి మర్డర్ కేసు, ఇందులో ఒక యువకుడు కత్తితో 17 సార్లు ఒక అమ్మాయిపై దాడి చేశాడు. ప్రజలు గుమిగూడారు, కానీ ఎవరూ అతన్ని ఆపలేదు. ఆ దాడి(attack) జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న వ్యక్తులు అడ్డుకుంటే ఇలాంటివి తగ్గే అవకాశం ఉంటుందని ప్రజలకు సూచిస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: IIT Student: ఉగ్రవాద సంస్థలో చేరేందుకు వెళ్తూ పట్టుబడ్డ ఐఐటీ విద్యార్థి

Updated Date - Mar 24 , 2024 | 10:49 AM

Advertising
Advertising