ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Stock Markets: సెన్సెక్స్ దూకుడు, 927 పాయింట్ల వృద్ధి..కారణమిదేనా?

ABN, Publish Date - Mar 28 , 2024 | 01:12 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) గురువారం(మార్చి 28న) ఫుల్ జోష్‌తో కొనసాగుతున్నాయి. స్టాక్ మార్కెట్‌లో విపరీతమైన కొనుగోళ్ల కారణంగా మార్కెట్‌లోని ప్రధాన సూచీలు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటి గంటకు సెన్సెక్స్(sensex) 927 పాయింట్ల లాభంతో 73876 దగ్గర ట్రేడైంది.

దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) గురువారం(మార్చి 28న) ఫుల్ జోష్‌తో కొనసాగుతున్నాయి. స్టాక్ మార్కెట్‌లో విపరీతమైన కొనుగోళ్ల కారణంగా మార్కెట్‌లోని ప్రధాన సూచీలు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటి గంటకు సెన్సెక్స్(sensex) 927 పాయింట్ల లాభంతో 73876 దగ్గర ట్రేడైంది. మరోవైపు నిఫ్టీ(nifty) కూడా 281 పాయింట్లు జంప్ చేసి 22404 దాటింది. ఇక బ్యాంక్ నిఫ్టీ(bank nifty) 508 పాయింట్లు జంప్ చేసి 47, 289 వద్దకు చేరుకోగా, నిఫ్టీ మిడ్ క్యాప్(nifty midcap) సూచీ 300 పాయింట్లు లాభపడి 48123 స్థాయికి చేరుకుంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్(kotak mahindra bank) సొనాటా ఫైనాన్స్‌లో 100% వాటాను రూ. 537 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఈ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. దీంతోపాటు ఆసియా మార్కెట్లతోపాటు అంతర్జాతీయంగా సానుకూల అంశాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. VIP పరిశ్రమల షేర్లు గురువారం రోజు 13% కంటే ఎక్కువ లాభాలతో ట్రేడవుతున్నాయి. ఆగస్టు 12, 2021 నుంచి వారి అత్యుత్తమ సింగిల్ డే లాభాన్ని నమోదు చేశాయి.


ఈ క్రమంలో టాప్ 5 లాభాల స్టాక్స్‌లలో బజాజ్ ఫిన్‌సర్వ్, గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటోకార్ప్, అపోలో హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక టాప్ 3 నష్టాల స్టాక్స్‌లలో శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్ కలవు.

అంతకుముందు బుధవారం సెన్సెక్స్(sensex) 526 పాయింట్ల లాభంతో 72,996 వద్ద ముగిసింది. గత ట్రేడింగ్ సెషన్‌లో అమెరికా సూచీలు లాభాల్లో ముగిశాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ (DJIA) 477.75 పాయింట్లు లేదా 1.22 శాతం పెరిగి 39,760.08 వద్ద ఉండగా, S&P 500 0.86 శాతం లాభంతో 5,248.49 వద్ద ముగిసింది. NASDAQ 0.51 శాతం పెరిగి 16,399.52 వద్ద ముగిసింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Best Restaurants: ఆసియాలో టాప్ 50 బెస్ట్ రెస్టారెంట్‌ల జాబితాలో ఇండియా నుంచి..

Updated Date - Mar 28 , 2024 | 01:14 PM

Advertising
Advertising