Share News

Best Restaurants: ఆసియాలో టాప్ 50 బెస్ట్ రెస్టారెంట్‌ల జాబితాలో ఇండియా నుంచి..

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:47 PM

ఇటివల ఆసియా(Asia)లోనే 50 బెస్ట్ రెస్టారెంట్‌ల(restaurants) 2024 జాబితాను విడుదల చేశారు. వాటిలో భారత్ నుంచి మూడు రెస్టారెంట్లు చోటు దక్కించుకున్నాయి. సియోల్‌లో జరిగిన వేడుకలో ఉత్తమ రెస్టారెంట్‌ల 12వ ఎడిషన్‌ జాబితాను రిలీజ్ చేసిన క్రమంలో పేర్కొన్నారు.

Best Restaurants: ఆసియాలో టాప్ 50 బెస్ట్ రెస్టారెంట్‌ల జాబితాలో ఇండియా నుంచి..

ఇటివల ఆసియా(Asia)లోనే 50 బెస్ట్ రెస్టారెంట్‌ల(restaurants) 2024 జాబితాను విడుదల చేశారు. వాటిలో భారత్ నుంచి మూడు రెస్టారెంట్లు చోటు దక్కించుకున్నాయి. సియోల్‌లో జరిగిన వేడుకలో ఉత్తమ రెస్టారెంట్‌ల 12వ ఎడిషన్‌ జాబితాను రిలీజ్ చేసిన క్రమంలో పేర్కొన్నారు. ఈ జాబితాలో టోక్యోలోని సజెన్‌, ఫ్లోరిలేజ్‌ రెస్టారెంట్లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. ముంబై(mumbai)లోని మాస్క్ రెస్టారెంట్ భారతదేశంలో అత్యుత్తమ రెస్టారెంట్‌గా నిలించింది. అయితే ఇది జాబితాలో 23వ స్థానం దక్కించుకుంది. మరోవైపు న్యూఢిల్లీ(delhi)లోని ఇండియన్ యాక్సెంట్ రెస్టారెంట్ 26వ ర్యాంక్‌ను పొందగా, చెన్నై(chennai)లోని అవర్తనా రెస్టారెంట్ 44వ స్థానంలో నిలిచింది.


జాబితా ప్రకారం ముంబైలోని మాస్క్ రెస్టారెంట్(Masque Restaurant) వరుసగా రెండవ సంవత్సరం భారతదేశంలో ఉత్తమ రెస్టారెంట్‌గా ప్రకటించబడింది. దీనికి అదితి దుగర్, చెఫ్ వరుణ్ టోట్లానీ నాయకత్వం వహిస్తున్నారు. ఈ రెస్టారెంట్‌‌లో రూ. 4,583 నుంచి మెనూ ప్రారంభమవుతుంది. ఇక ఢిల్లీలోని ఇండియన్ యాక్సెంట్(Indian Accent) రెస్టారెంట్ 2015 నుంచి 2021 వరకు భారతదేశంలో ఉత్తమ రెస్టారెంట్ టైటిల్‌ను గెలుచుకుంది. కానీ 2022లో జాబితా నుంచి తొలగిపోయి 2023లో ఈ రెస్టారెంట్ 19వ స్థానంలో నిలిచింది. ప్రఖ్యాత చెఫ్ మనీష్ మెహ్రోత్రాచే 2009లో స్థాపించబడిన ఈ రెస్టారెంట్‌లో వంటకాలు రూ. 4,167 నుంచి ప్రారంభమవుతాయి.

మరోవైపు చెన్నైకి చెందిన అవర్తనా(avartana restaurant) ఈ జాబితాలో కొత్త ఎంట్రీగా అవార్డును గెలుచుకుంది. ఈ రెస్టారెంట్ దక్షిణ భారత వంటకాలతో ఉంటుంది. ఇక్కడ డిన్నర్ కోసం టేస్టింగ్ మెనూ రూ. 2916 నుంచి ప్రారంభమవుతుంది. ఈ జాబితాలో టాప్ 50లో అత్యధిక సంఖ్యలో రెస్టారెంట్లు సింగపూర్‌కు చెందినవి (9) ఉన్నాయి. బ్యాంకాక్‌లో ఏడు రెస్టారెంట్లు, హాంకాంగ్‌లో ఆరు రెస్టారెంట్లు జాబితాలో చేర్చబడ్డాయి. బీజింగ్‌లోని ఒక రెస్టారెంట్ వన్ టు వాచ్ అవార్డును గెలుచుకుంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Pan Aadhaar: పాన్ ఆధార్ లింక్ చేయలేదా.. వెంటనే చేయండి, లేదంటే ఫైన్!

Updated Date - Mar 28 , 2024 | 12:50 PM