ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 480 పాయింట్లు ప్లస్!

ABN, Publish Date - Apr 25 , 2024 | 04:13 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో దూసుకుపోతున్నాయి. వరుసగా ఐదో రోజు కూడా లాభాలను అందుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, దేశీయ కంపెనీలు వెల్లడిస్తున్న ఫలితాలు, ప్రీ-ఎలక్షన్ ర్యాలీ దేశీయ సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి.

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో దూసుకుపోతున్నాయి. వరుసగా ఐదో రోజు కూడా లాభాలను అందుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, దేశీయ కంపెనీలు వెల్లడిస్తున్న ఫలితాలు, ప్రీ-ఎలక్షన్ ర్యాలీ దేశీయ సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి. ఈ రోజు ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్‌లో కొనుగోళ్ల కారణంగా లాభాల్లోకి దూసుకెళ్లాయి (Business News).


గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఓ దశలో 73,556 వద్ద ఇంట్రాడే లోని తాకింది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా లాభాల్లోకి దూసుకెళ్లింది. ఇంట్రాడే కనిష్టం నుంచి ఏకంగా 1000 పాయింట్లు లాభపడింది. చివరకు 480 పాయింట్ల లాభంతో 74,339 వద్ద రోజును ముగించింది. నిఫ్టీ కూడా 167 పాయింట్లు లాభపడి 22,570 వద్ద రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 305 పాయింట్లు లాభపడింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 236 పాయింట్లు ఎగబాకింది.


సెన్సెక్స్‌లో ప్రధానంగా యాక్సిస్ బ్యాంక్, భారత్ ఫోర్జ్, వోడాఫోన్ ఐడియా, ఏబీ క్యాపిటల్ లాభాలను ఆర్జించాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, దాల్మియా భారత్, ఇండియన్ హోటల్స్, మెట్రోపోలిస్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.32గా ఉంది.

ఇవి కూడా చదవండి..

Gold Prices: బంగారం లాంటి అవకాశం.. అస్సలు మిస్ కావొద్దు!


PAN Card: బిగ్ అలర్ట్.. పాన్ కార్డ్ హోల్డర్స్ మే 31వ తేదీలోపు ఆ పని చేయకపోతే..


మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 25 , 2024 | 04:13 PM

Advertising
Advertising