ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

OnePluse: మే 1 నుంచి వన్‌ ప్లస్‌ ఉత్పత్తుల అమ్మకం నిలిపివేత..!

ABN, Publish Date - Apr 11 , 2024 | 01:05 PM

దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు కంపెనీ ఎలాంటి చొరవ తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ మే 1వ తేదీ నుంచి వన్‌ ప్లస్‌(OnePluse) ఉత్పత్తుల అమ్మకాలు నిలిపివేస్తామని దక్షిణ భారత వ్యవస్థీకృత రిటైలర్ల సంఘం (ఓఆర్‌ఏ)(ORA) హెచ్చరించింది. వారు ఈ మేరకు వన్‌ ప్లస్‌ టెక్నాలజీ ఇండియా సేల్స్‌ డైరెక్టర్‌ రంజిత్‌ సింగ్‌కు(Ranjit Singh) ఒక లేఖ రాశారు.

OnePluse

హైదరాబాద్‌, ఏప్రిల్ 11: దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు కంపెనీ ఎలాంటి చొరవ తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ మే 1వ తేదీ నుంచి వన్‌ ప్లస్‌(OnePluse) ఉత్పత్తుల అమ్మకాలు నిలిపివేస్తామని దక్షిణ భారత వ్యవస్థీకృత రిటైలర్ల సంఘం (ఓఆర్‌ఏ)(ORA) హెచ్చరించింది. వారు ఈ మేరకు వన్‌ ప్లస్‌ టెక్నాలజీ ఇండియా సేల్స్‌ డైరెక్టర్‌ రంజిత్‌ సింగ్‌కు(Ranjit Singh) ఒక లేఖ రాశారు. గత ఏడాది కాలంగా తాము ఈ సమస్యలను పలుమార్లు కంపెనీ దృష్టికి తెచ్చినా ఎలాంటి స్పందన కనిపించలేదని, ఫలితంగా తాము కఠిన నిర్ణయం తీసుకోవలసివచ్చిందని తెలిపారు. వన్‌ ప్లస్‌ ఉత్పత్తుల విక్రయంపై తమకు చాలా తక్కువ మార్జిన్లు వస్తున్నాయని, ఫలితంగా వ్యాపారం సవాలుగా మారిందని వారు వెల్లడించారు. వారెంటీ, సర్వీస్‌ క్లెయిమ్‌ల పరిష్కారంలో తీవ్ర జాప్యం కారణంగా కస్టమర్లు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారని ఇది తమకు అదనపు భారంగా పరిణమించిందని తెలియచేశారు. ఈ నెలాఖరు లోగా సానుకూలంగా స్పందించి ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆ సంఘం నాయకులు కోరారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 11 , 2024 | 01:05 PM

Advertising
Advertising