ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Next Week IPOs: వచ్చే వారంలో కీలక ఐపీఓలు.. ఓలా ఎలక్ట్రిక్ సహా 10 కంపెనీలు సిద్ధం

ABN, Publish Date - Jul 28 , 2024 | 01:27 PM

దేశీయ స్టాక్ మార్కెట్లో (stock market) మళ్లీ ఐపీఓల(next week ipos) వారం వచ్చేసింది. ఈ క్రమంలో జులై 29 నుంచి ప్రారంభమయ్యే వారంలో ప్రైమరీ మార్కెట్‌లో చాలా కార్యకలాపాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈసారి కొత్తగా 10 ఐపీఓలు వస్తున్నాయి.

next week ipos july 29th

దేశీయ స్టాక్ మార్కెట్లో (stock market) మళ్లీ ఐపీఓల(next week ipos) వారం వచ్చేసింది. ఈ క్రమంలో జులై 29 నుంచి ప్రారంభమయ్యే వారంలో ప్రైమరీ మార్కెట్‌లో చాలా కార్యకలాపాలు ఉన్నాయి. ఎందుకంటే ఈసారి కొత్తగా 10 ఐపీఓలు వస్తున్నాయి. వీటిలో మెయిన్‌బోర్డ్ సెగ్మెంట్ నుంచి 3, SME సెగ్మెంట్ నుంచి 7 ఉన్నాయి. ఇవి కాకుండా ఇప్పటికే ప్రారంభించిన ఐదు IPOలలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి కూడా అవకాశం ఉంది. అయితే కొత్తగా రానున్న ఐపీఓల వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


బల్క్‌కార్ప్ ఇంటర్నేషనల్ IPO: రూ. 20.78 కోట్ల ఈ ఇష్యూ జులై 30న ప్రారంభమై, ఆగస్టు 1న ముగుస్తుంది. ఆగస్టు 6న NSE SMEలో షేర్ల లిస్టింగ్ జరుగుతుంది. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 100-105, లాట్ పరిమాణం 1200 షేర్లు.

సత్లోఖర్ సినర్జీస్ E&C గ్లోబల్ IPO: ఇది జులై 30న తెరవబడుతుంది. ఆగస్టు 1న పూర్తవుతుంది. రూ. 92.93 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఆగస్టు 6న ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈలో షేర్లు లిస్ట్ చేయబడతాయి. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 133-140, లాట్ పరిమాణం 1000 షేర్లు.


Kizi Apparels IPO: రూ. 5.58 కోట్ల ఈ ఇష్యూ కూడా జులై 30న ప్రారంభం కానుంది. ఆగస్టు 1 వరకు బిడ్‌లు దాఖలు చేయవచ్చు. ఆగస్టు 6న బీఎస్‌ఈ ఎస్‌ఎంఈలో షేర్లు లిస్ట్ కానున్నాయి. ఒక్కో షేరు ధర రూ. 21, లాట్ పరిమాణం 6000 షేర్లు.

అకుమ్స్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ IPO: రూ. 1,856.74 కోట్లతో జులై 30న ప్రారంభం కానున్న ఈ ఇష్యూ ఆగస్టు 1న ముగుస్తుంది. ఆగస్టు 6న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో షేర్ల లిస్టింగ్ జరగనుంది. ఒక్కో షేరు ధర రూ. 646-679. లాట్ పరిమాణం 22 షేర్లు.

ఇవి కూడా చదవండి:

Womens Asia Cup Final: నేడు మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్ పోరు.. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే..


ఆషాపురా లాజిస్టిక్స్ IPO: ఇది కూడా జులై 30న తెరవబడి, ఆగస్టు 1న ముగుస్తుంది. రూ. 52.66 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఒక్కో షేరు ధర రూ. 136-144. లాట్ పరిమాణం 1000 షేర్లు. షేర్లు ఆగస్టు 6న NSE SMEలో లిస్ట్ కావచ్చు.

రాజ్‌పుతానా ఇండస్ట్రీస్ IPO: రూ. 23.88 కోట్ల ఈ ఇష్యూకి ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 36-38. లాట్ పరిమాణం 3000 షేర్లు. IPO జులై 30న ప్రారంభమై, ఆగస్టు 1న ముగియనుంది. ఆగస్టు 6న NSE SMEలో షేర్ల లిస్టింగ్ జరుగుతుంది.


ఉత్సవ్ Cz గోల్డ్ జ్యువెల్స్ IPO: ఈ ఇష్యూ జులై 31న ప్రారంభమై, ఆగస్టు 2న ముగుస్తుంది. రూ. 69.50 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 104-110. లాట్ పరిమాణం 1200 షేర్లు. ఆగస్టు 7న ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈలో షేర్లు లిస్ట్ చేయబడతాయి.

సిగల్ ఇండియా IPO: ఇది ఆగస్టు 1న తెరవబడుతుంది. దీని ధర, లాట్ పరిమాణం ఇంకా ప్రకటించబడలేదు. ఆగస్టు 5 వరకు బిడ్లు దాఖలు చేయవచ్చు. ఆగస్టు 8న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో షేర్లు లిస్టయ్యే అవకాశం ఉంది.


ధరివాల్‌కార్ప్ IPO: ఈ ఇష్యూ కూడా ఆగస్టు 1న తెరవబడుతుంది. ఆగస్టు 5న ముగుస్తుంది. ఆగస్టు 8న NSE SMEలో షేర్లు లిస్ట్ కావచ్చు. ఈ IPO కోసం ధర, బ్యాండ్, లాట్ పరిమాణం ఇంకా ప్రకటించబడలేదు.

Ola ఎలక్ట్రిక్ IPO: సాఫ్ట్‌బ్యాంక్ సపోర్ట్ గల ఓలా ఎలక్ట్రిక్ IPO ఆగస్టు 2న రిటైల్ సబ్‌స్క్రిప్షన్ తెరవబడుతుంది. ఆగస్టు 6న మూసివేయబడుతుంది. Ola వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ 37.9 మిలియన్ షేర్లను విక్రయించనున్నారు. ఈ క్రమంలో కంపెనీ రూ.5,500 కోట్లు సమీకరించాలని భావిస్తోంది.


ఇవి కూడా చదవండి:

Rich Stock: ఏడాదిలోనే ధనవంతులను చేసిన టాటా గ్రూప్ స్టాక్.. ఇంకా పెరగనుందా?


Saving Schemes: ఈ పోస్టాఫీస్ స్కీం ద్వారా ఐదేళ్లలో లక్షాధికారులు కావచ్చు..ఎలాగంటే


Bank Holidays: ఆగస్టులో దాదాపు సగం రోజులు బ్యాంకులు బంద్.. కారణాలివే

Read More Business News and Latest Telugu News

Updated Date - Jul 28 , 2024 | 01:30 PM

Advertising
Advertising
<