ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. దిశ పొలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

ABN, Publish Date - May 24 , 2024 | 10:07 PM

విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ ప్రొఫెసర్ కాలేజీలోని విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఎన్ని చట్టాలు వస్తున్న మాత్రం ఇలాంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. వివరాల్లోకి వెళ్తే... భీమిలి మండలం సంగివలన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో రేడియాలజీ ప్రొఫెసర్ టి. నాగేశ్వరరావు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ దిశ పొలీస్ స్టేషన్‌లో విద్యార్థినులు ఫిర్యాదు చేశారు.

విశాఖపట్నం: విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ ప్రొఫెసర్ కాలేజీలోని విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఎన్ని చట్టాలు వస్తున్న మాత్రం ఇలాంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. వివరాల్లోకి వెళ్తే... భీమిలి మండలం సంగివలన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో రేడియాలజీ ప్రొఫెసర్ టి. నాగేశ్వరరావు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ దిశ పొలీస్ స్టేషన్‌లో విద్యార్థినులు ఫిర్యాదు చేశారు.


ఈ ఘటన పై దిశ ఏసీపీ వివేకానంద మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై కొందరు విద్యార్థినులు తమ స్టేషన్‌ను ఆశ్రయించారని తెలిపారు.విద్యార్థినుల ఫిర్యాదు మేరకు రేడియాలజీ ప్రొఫెసర్‌పై కేసు నమోదు చేశామని అన్నారు. ఈ నెల 3వ తేదిన కాలేజీ విద్యార్థులు ప్రొఫెసర్‌పై కాలేజీ యాజమాన్యానికి కూడా ఫిర్యాదు చేశారని చెప్పారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై పాత కేసులు కూడా ఉన్నాయన్నారు. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ యాజమాన్యం ఈయనపై చర్యలు తీసుకున్నారని కాలేజీ డీన్ తెలిపారని చెప్పారు. ఈ కేసు పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని దిశ ఏసీపీ వివేకానంద పేర్కొన్నారు.

Updated Date - May 24 , 2024 | 10:07 PM

Advertising
Advertising