ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అమెరికాకు విజయలక్ష్మి!

ABN, Publish Date - Apr 13 , 2024 | 04:48 AM

వైఎస్‌ విజయలక్ష్మి అమెరికా వెళ్లిపోయారు. మనసు కూతురు షర్మిల వైపే లాగుతున్నా... కుమారుడు జగన్‌ ఒత్తిడి భరించలేక...

అన్నా చెల్లెళ్ల యుద్ధంతో తల్లికి సంకటం

తన తరఫున ప్రచారం చేయాలని జగన్‌ ఒత్తిడి

దాని వల్ల షర్మిలకు నష్టమని తల్లి భావన

ఎటూ తేల్చుకోలేక విదేశాలకు!

అమరావతి, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ విజయలక్ష్మి అమెరికా వెళ్లిపోయారు. మనసు కూతురు షర్మిల వైపే లాగుతున్నా... కుమారుడు జగన్‌ ఒత్తిడి భరించలేక... ఎటు ఉండాలో తేల్చుకోలేక విదేశాలకు వెళ్లిపోయినట్లు సమాచారం. ఎన్నికలు ముగిసిన తర్వాతే ఆమె తిరిగి స్వదేశం చేరుకుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్‌ కు... ఆయన సోదరి, పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు మధ్య ‘పొలిటికల్‌ వార్‌’ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది తల్లికి సంకటంగా మారింది. జగన్‌ సీఎం అయ్యేందుకు తల్లీకూతుళ్లిద్దరూ కష్టపడ్డారు. అధికారంలోకి రాగానే జగన్‌... ఆ ఇద్దరినీ పక్కనపెట్టారనే విమర్శలు వచ్చాయి. సీఎంగా జగన్‌ ప్రమాణ స్వీకారానికి హాజరైన విజయలక్ష్మి... ఆ తర్వాత అడపా దడపా మాత్రమే ఆయనతో కనిపించారు. గౌరవాధ్యక్ష పదవి నుంచి ‘తప్పుకునేలా’ పార్టీ ప్లీనరీలోనే ఆమె చేత ప్రకటన చేయించారు. అన్నతో విభేదించి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు... విజయలక్ష్మి ఆమెతోనే ఉన్నారు. అప్పుడు హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఆ తర్వాత ‘వైఎస్సార్‌ జీవన సాఫల్య’ పురస్కారాల సమయంలో మాత్రమే ఏపీలో ఆమె వేదికపై కనిపిస్తున్నారు.

అటూ... ఇటూ

షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి... జగన్‌పై యు ద్ధం ప్రకటించగానే విజయలక్ష్మికి ఇక్కట్లు మొదలయ్యాయి. తల్లి మద్దతు తనకే ఉందనిపించుకునేందుకు జగన్‌ రకరకాలుగా ప్రయత్నించారు. గతనెల 27న జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ప్రారంభానికి ముం దు ఇడుపులపాయలో వైఎస్‌ ఘాట్‌ వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో విజయలక్ష్మి పాల్గొన్నారు. ఆ తర్వాత షర్మిల బస్సుయాత్ర చేపట్టిన సమయంలోనూ ఇడుపులపాయలో కూతురి కోసం ఆమె ప్రత్యేక ప్రార్థనలూ చేశారు. ఆ సంగతి ఎలా ఉన్నా... ఎన్నికల్లో తన తరఫున ప్రచా రం చేయాలని, జనంలో తిరగాలని, తనకే మద్దతు ఉన్నట్లు సంకేతాలు పం పించాలని జగన్‌ తన తల్లిని గట్టిగా కోరినట్లు సమాచారం. ఈ ఒత్తిడి భరించలేక ఒక దశలో ఆమె ఇందుకు అంగీకరించినట్లు కూడా తెలుస్తోంది. కానీ... ఆ తర్వాత మనసు మార్చకున్నట్లు సమాచారం. కడ ప జిల్లాలో షర్మిలకు లభిస్తున్న మద్దతు, వైఎస్‌ బిడ్డగా జనం ఆదరిస్తు న్న తీరు, వివేకా హత్య ఉదంతం... వీటన్నింటి నేపథ్యంలో జగన్‌ తరఫున ప్రచారం చేయడం సరికాదని, ఇది కూతురికి నష్టం చేస్తుందని విజయలక్ష్మి భావించినట్లు చెబుతున్నారు. ఈ సంకటం నుంచి బయటపడలేకే ఆమె అమెరికాలో బంధువుల వద్దకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

Updated Date - Apr 13 , 2024 | 04:48 AM

Advertising
Advertising