TDP - BJP: వారం రోజుల్లో ఏపీలో టీడీపీ-బీజేపీ పొత్తుపై క్లారిటీ?
ABN, Publish Date - Mar 01 , 2024 | 08:29 PM
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ-బీజేపీ పొత్తుపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో చంద్రబాబు నాయుడు ఇటీవలే భేటీ అయ్యి కీలకాంశాలపై చర్చించారు. అయితే పొత్తుపై మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. దీంతో రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే రేపు, ఎల్లుండి (శని, ఆదివారం) బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరగనున్న నేపథ్యంలో పొత్తుపై ఏమైనా క్లారిటీ వస్తుందా అనే చర్చ మొదలైంది.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ-బీజేపీ పొత్తుపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో చంద్రబాబు నాయుడు ఇటీవలే భేటీ అయ్యి కీలకాంశాలపై చర్చించారు. అయితే పొత్తుపై మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. దీంతో రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే రేపు, ఎల్లుండి (శని, ఆదివారం) బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరగనున్న నేపథ్యంలో పొత్తుపై ఏమైనా క్లారిటీ వస్తుందా అనే చర్చ మొదలైంది. వారం రోజుల్లో బీజేపీ-టీడీపీ పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఏపీ బీజేపీ నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
కాగా శని, ఆదివారాల్లో జరగనున్న కోర్ కమిటీ భేటీకి ముఖ్యనేతలతో పాటు జిల్లాల నుంచి కీలకమైన నేతలకు ఆహ్వానాలు పంపించారు. జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్‌ను కూడా ఆహ్వానించారు. ఈ కీలక సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పొత్తులపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సమావేశంలో టీడీపీ-బీజేపీ పొత్తుపై ఏమైనా స్పష్టత వస్తుందో లేదో వేచిచూడాలి.
Updated Date - Mar 01 , 2024 | 08:29 PM