ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nandyal YCP: నంద్యాల వైసీపీలో ముసలం.. ఎమ్మెల్యే శిల్పా రవిపై జెడ్పీటీసీ గోకుల్ ఫైర్

ABN, Publish Date - Jan 24 , 2024 | 02:06 PM

నంద్యాల వైసీపీలో అధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరింది. ఎమ్మెల్యే శిల్పా రవి, జెడ్పీటీసీ గోకుల్ క్రిృష్ణారెడ్డి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. శిల్పా రవిని స్థానికేతరుడు అని గోకుల్ విమర్శిస్తున్నారు.

కర్నూలు: నంద్యాల వైసీపీలో అధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరింది. ఎమ్మెల్యే శిల్పా రవి (Shilpa Ravi), జెడ్పీటీసీ గోకుల్ క్రిృష్ణారెడ్డి (Gokul Krishna Reddy) మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. శిల్పా రవిని స్థానికేతరుడు అని గోకుల్ విమర్శిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా స్థానికేతరుల కబంధ భస్తాల్లో నంద్యాల నలిగిపోతుందని పేర్కొన్నారు. వారి నుంచి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు. లోకల్, నాన్ లోకల్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఆత్మ గౌరవ ఓదార్పు యాత్ర చేపట్టారు. గోకుల్ క్రిృష్ణారెడ్డి యాత్రను పోలీసులు నంద్యాల బస్టాండ్ వద్ద అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే శిల్పా రవిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఎమ్మెల్యే శిల్పా రవి స్థానికేతరుడు అని గోకుల్ క్రిృష్ణారెడ్డి చెబుతున్నారు. తనపై పగబట్టి యాత్ర నిలిపివేశారని పేర్కొన్నారు. స్థానికుల ఎదుగుదలను ఎన్నిరోజులు అపుతారని ఆయన ప్రశ్నించారు. మీ బెదిరింపులకు భయపడే వారు లేరన్నారు. రెచ్చగొట్టే రాజకీయాలు చేయొద్దని సూచించారు. అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. స్థానికేతరులు వ్యాపారాలు చేసి లాభ పడుతున్నారని మండిపడ్డారు. తమను పావులా వాడుకుంటున్నారని గోకుల్ క్రిృష్ణారెడ్డి విరుచుకుపడ్డారు. ఇకపై నంద్యాలకు స్థానిక నాయకులు కావాలా, స్థానికేతరులు కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరారు.

గోకుల్ క్రిృష్ణారెడ్డి నంద్యాల వైసీపీ జెడ్పీటీసీగా ఉన్నారు. వచ్చే ఎన్నికలో నంద్యాల అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. అందుకోసం జనాల్లోకి వెళుతున్నారు. ఎమ్మెల్యే శిల్పా రవి లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. జనాల్లో సింపతి పొందేందుకు లోకల్, నాన్ లోకల్ అని అంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యీ శిల్పా రవి గోకుల్ క్రిృష్ణారెడ్డిని అడ్డుకుంటున్నారు. యాత్ర గురించి సమాచారం రాగానే పోలీసుల చేత బ్రేక్ వేయించారు. ఎక్కడ చిన్న అవకాశం ఇవ్వడం లేదు. నంద్యాలలో ఇద్దరు నేతల ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 24 , 2024 | 02:06 PM

Advertising
Advertising