ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Potina Mahesh: కల్లు తాగిన కోతిలా కొడాలి నాని వాగుతున్నాడు: పోతిన మహేష్

ABN, Publish Date - Feb 14 , 2024 | 06:29 PM

కల్లు తాగిన కోతిలా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వాగుతున్నారని జనసేన నేత పోతిన మహేష్ (Potina Mahesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడ: కల్లు తాగిన కోతిలా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వాగుతున్నారని జనసేన నేత పోతిన మహేష్ (Potina Mahesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నాడు జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీఎం జగన్ ఐదు కిలోమీటర్ల పర్యటనకు హెలికాప్టర్లో వెళ్లినప్పుడు కొడాలి నాని ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం సీఎం జగన్‌ని వదిలించుకోవడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల బాణం తిరిగి వారికే ఎక్కు పెట్టేసరికి మతి భ్రమించిందని ఎద్దేవా చేశారు. షర్మిల ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేక నోరు పారేసుకుంటున్నారని దెప్పిపొడిచారు. జగన్ వైఫల్యాలను ప్రశ్నిస్తే.. తట్టుకోలేక వాగుతున్నారన్నారు. మెగా డీఎస్సీ కాదు ... దగా డీఎస్సీ అంటే ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. మాట తప్పి మోసం చేసిన అంశాలపై మాట్లాడకుండా ప్రశ్నించిన వారిపై నోరేసుకుని పడటమే వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందని పోతిన మహేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Updated Date - Feb 14 , 2024 | 06:29 PM

Advertising
Advertising