AP Politics: చంద్రబాబు నాకు అన్యాయం చేయరు.. జలీల్ ఖాన్ కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Feb 02 , 2024 | 04:52 PM
రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయంపై మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్(Jaleel Khan) కీలక వ్యాఖ్యలు చేశారు. మైనార్టీలు అందరూ తనకు సీటు ఇవ్వాలని కోరుతున్నారని చెప్పారు.
విజయవాడ: రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయంపై మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్(Jaleel Khan) కీలక వ్యాఖ్యలు చేశారు. మైనార్టీలు అందరూ తనకు సీటు ఇవ్వాలని కోరుతున్నారని చెప్పారు. విజయవాడ పశ్చిమ సీటు టీడీపీ గెలిచే సీటు అని చెప్పారు. ఇతర వర్గాలు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని జలీల్ ఖాన్ తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ టికెట్‌ను జలీల్ ఖాన్‌కే ఇవ్వాలంటూ ముస్లిం సంఘాలు శుక్రవారం నాడు బారీగా ర్యాలీ తీశాయి. ముస్లింలు ఎక్కువుగా ఉన్న ఈ నియోజకవర్గ సీటును జలీల్ ఖాన్‌కు ఇవ్వడం ద్వారా ఏపీ వ్యాప్తంగా మైనార్టీల్లో ప్రభావం ఉంటుందని ముస్లిం సంఘాలు తెలిపాయి. తనకు మద్దతుగా చేపట్టిన ర్యాలీలో జలీల్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జలీల్ ఖాన్ మాట్లాడుతూ.. తమకు ఈ సీటే కీలకమని.. ముస్లింల సెంటిమెంట్‌ను కూడా పార్టీ హై కమాండ్ గుర్తించాలని చెప్పారు.
చంద్రబాబు అలా.. చేయరు
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లను కూడా కలిసి ఈ సీటును తనకే కేటాయించాలని విన్నవించినట్లు తెలిపారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గాన్ని తాను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. తనకు సీటు ఇస్తే భారీ మెజార్టీతో తప్పకుండా గెలుస్తానని అన్నారు. వైసీపీ ముస్లింలకు ఇచ్చారు కాబట్టి... టీడీపీ కూడా తనకే కేటాయించాలని కోరారు. పొత్తులో జనసేనకు సీటు ఇస్తే వాళ్లు గెలవాలి కదా అని ప్రశ్నించారు. ఇక్కడ మెజార్టీ భాగం ముస్లింలే ఉన్నారని వివరించారు. తనకు తప్పకుండా సీటు ఇస్తారని, ఇవ్వాలని కోరుతున్నానని అన్నారు. మైనార్టీల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు చేయరని.. ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం మైనార్టీల్లో ఈ సీటు ప్రభావం ఉంటుందని జలీల్ ఖాన్ తెలిపారు.
Updated Date - Feb 02 , 2024 | 04:52 PM