ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డ్యామిట్‌.. కథ అడ్డం తిరిగింది..!

ABN, Publish Date - Aug 30 , 2024 | 11:52 PM

జగన సర్కారు 2019లో నూతన మద్యం పాలసీ తీసుకువచ్చింది. ప్రైవేటు షాపులకు మంగళం పలికి ప్రభుత్వమే మద్యం అమ్మకాలు మొదలు పెట్టింది. రెండేళ్ల క్రితం బార్లకు వేలం వేసింది. కడపలో 12, ప్రొద్దుటూరులో 8, బద్వేలులో 2, పులివెందుల, జమ్మలమడుగు, కమలాపురం,

స్టేట్‌లోనే అత్యధికంగా వేలంలో రూ.1.83 కోట్లు పలికిన ఎర్రముక ్కపల్లె వద్ద గల బార్‌

బార్ల ఫీజులో రాయితీ ఇస్తామని నేతల హామీ

రెండు నెలలుగా లైసెన్స ఫీజులు చెల్లించకుండా కాలయాపన

20వ తేదీతో ముగిసిన గడువు

18 శాతం వడ్డీతో.. రేపు ఆఖరు

రూ.30లక్షలకు పైగా అదనపు భారం

అనుకున్నది ఒకటి అయింది ఒక్కటీ.. బోల్తా పడిందిలే బుల్‌ బుల్‌ పిట్టా అని నాలుగు దశాబ్దాల క్రితం బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాలో పాట ఉంది. అది బాగా ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు అచ్చం అలాగే తయారైంది కడప బార్‌ యజమానుల పరిస్థితి. రెండేళ్ల క్రితం నిర్వహించిన వేలంలో పోటీ పడి మరీ బార్లను దక్కించుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా కడపలోనే అత్యధిక ధరలు పలికాయి. రెండేళ్లపాటు లైసెన్సు ఫీజులు చెల్లించారు. లాభాలు బాగానే గడించారు. అయితే కూటమి ప్రభుత్వం రావడం, నూతన ఎక్సైజ్‌ పాలసీ విధానం తీసుకువస్తామని ప్రకటించడంతో.. బార్ల యజమానులు లైసెన్సు ఫీజు చెల్లించడంలో పునరాలోచనలో పడ్డారు. ఇంతలో కూటమి నేతలు జిల్లాలోని కొన్ని బార్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వంతో మాట్లాడి లైసెన్సు ఫీజులో రాయితీ ఇప్పిస్తామని బార్ల యజమానులకు హామీ ఇచ్చారు. వారి మాటలు నమ్మి లైసెన్సు ఫీజు రెన్యువల్‌కు గడువు ముంచుకొస్తున్నా చెల్లించకండా లైట్‌ తీసుకున్నారు. అయితే ఆలస్యం చేస్తే బార్లు రద్దు చేస్తామని ఎక్సైజ్‌ శాఖ హెచ్చరించడం.. రాయితీ ఇప్పించడంలో కూటమి నేతలు చేతులెత్తేయడంతో.. డామిట్‌ కథ అడ్డం తిరిగిదంటూ.. 18 శాతం వడ్డీ చెల్లించి మరీ బార్లకు రెన్యువల్‌ చేయించుకోవాల్సి రావడం ఇప్పుడు మద్యం వ్యాపారుల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

(కడప-ఆంధ్రజ్యోతి): జగన సర్కారు 2019లో నూతన మద్యం పాలసీ తీసుకువచ్చింది. ప్రైవేటు షాపులకు మంగళం పలికి ప్రభుత్వమే మద్యం అమ్మకాలు మొదలు పెట్టింది. రెండేళ్ల క్రితం బార్లకు వేలం వేసింది. కడపలో 12, ప్రొద్దుటూరులో 8, బద్వేలులో 2, పులివెందుల, జమ్మలమడుగు, కమలాపురం, వేంపల్లె, పోరుమామిళ్ల, మైదుకూరులో ఒక్కో బార్‌కు వేలం నిర్వహించారు. ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ధరలు నిర్ణయించింది. కడప, ప్రొద్దుటూరులో ఒక్కో బార్‌ ధరను రూ.35లక్షలుగా నిర్ణయించింది. కడపలో మద్యం వ్యాపారుల మధ్య పోటీ లేకుండా సిండికేట్‌ చేసేందుకు అప్పట్లో వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నం చేసినా కుదరలేదు. పోటాపోటీగా వేలంలో పాల్గొన్నారు. దీంతో రాష్ట్రంలోనే అత్యఽఽధిక వేలం పలికిన మొదటి నాలుగు బార్లు కడపలోనే ఉన్నాయి. ఎర్రముక్కపల్లెలోని శ్రీకర్‌ బార్‌ను రూ.1.83 కోట్లతో దక్కించుకున్నారు. ఇదే రాష్ట్రంలో అత్యధిక ధర. రెండోది అప్సర వద్ద గల సుధా బార్‌ రూ.1.81 కోట్లు పలికింది. మూడోది చెన్నూరు బస్టాండులోని శివ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ 1.80కోట్లు, రాజంపేట రోడ్డులోని పునీత బార్‌ 1.79 కోట్లు పలికాయి. మిగతా బార్‌లు కూడా ప్రభుత్వ ధర కన్నా ఎక్కువకు పాడుకున్నారు.

అయితే ప్రభుత్వ మద్యం షాపుల్లో మందు బాబులు అప్పటి వరకు తాగిన బ్రాండ్లు లేకుండా జే బ్రాండ్‌లు వచ్చేశాయి. కంపెనీ మద్యం బదులు రూ.150, రూ.200 మందు ఇవ్వండనే పరిస్థితి వచ్చింది. బార్లలో అన్నిరకాల బ్రాండ్లు దొరికేవి. దీంతో మందుబాబులు బార్లకు వెళ్లి కొనుగోలు చేసేవారు. అక్కడ బ్రాండ్లను బట్టి క్వార్టరుపై రూ.50 నుంచి రూ.100 ఎక్కువగా విక్రయించేవారు. దీంతో వ్యాపారం లాభసాటిగా ఉండేది. ఇక నగరంలో ఉన్న బార్ల బ్యాచ తమకున్న పలుకుబడితో ప్రభుత్వ మద్యంషాపులన్నీ నగర శివారుల్లోకి, సుదూర ప్రాంతాల్లోకి తరలించేశారు. దీంతో మందుబాబులు దూరం వెళ్లలేక బార్లలోనే మద్యం కొనుగోలు చేసేవారు. దీంతో బార్ల బిజినెస్‌ కళకళలాడేది.

నూతన మద్యం పాలసీతో

జగన మద్యం పాలసీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పిచ్చి పిచ్చి బ్రాండ్లు, అధిక ధరలు ఆరోపణలకు తావిచ్చింది. ఈ నేపధ్యంలో నాణ్యమైన మందు ఇస్తామని కూటమి నేతలు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నూతన మద్యం పాలసీ తీసుకురావాలని నిర్ణయించారు. సెప్టెంబరు 30తో ఇప్పుడున్న మద్యంపాలసీ ముగియనుంది. ఈ నేపథ్యంలో అధికారం చేపట్టగానే కూటమి నేతలు కడపలో 2, జమ్మలమడుగులో ఒక బార్‌ను స్వాధీనం చేసుకున్నారు. బార్లు లాక్కున్న వ్యవహారం జిల్లాలో పెద్ద సంచలనమే రేకెత్తింది. అయితే ప్రభుత్వంలోని కీలక నేతలతో మాట్లాడి మద్యం ఫీజులో రాయితీ ఇప్పిస్తామంటూ కొందరు కూటమి నేతలు బార్ల యజమానులకు హామీ ఇస్తూ వచ్చారు. ఎందుకంటే బార్లు లాక్కున్న వారు కూడా ఫీజులు చెల్లించాల్సి రావడంతో.. ఎలాగైనా సరే లైసెన్సు ఫీజు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. లైసెన్సు గడువు శనివారంతో ముగుస్తుంది. సెప్టెంబరు 1 నుంచి బార్లు కొనసాగాలంటే లైసెన్సు ఫీజు చెల్లించాలి. వాస్తవానికి ఈ నెల 20లోపే డబ్బులు చెల్లించాల్సి ఉంది. అయితే కూటమి నేతల మాటలు విని కొంతమంది బార్ల యజమానులు లైసెన్సు ఫీజు చెల్లించలేదు. ఎలాగైనా వీరు మాట్లాడుతారులే అనే ఉద్దేశ్యంతో కట్టలేదు. ప్రొద్దుటూరు ఇతర ప్రాంతాల్లోని బార్ల యజమానులు మాత్రం డబ్బులు చెల్లించారు. కడపలో కూటమి నేతలు బార్లు లాక్కోవడంతో వాటి కోసం అయినా లైసెన్స ఫీజుపై రాయితీ ఇస్తారని బార్ల యాజమాన్యం ఆశించింది. గడువు దాటినా ఫీజు చెల్లించకపోవడంతో ఎక్సైజ్‌ అధికారులు హెచ్చరిస్తూ నాలుగురోజుల పాటు స్టాకు నిలిపివేశారు. చివరికి కూటమి నేతలతో ఎక్సైజ్‌ అధికారులకు ఫోను చేయించుకుని ఎలాగోలా స్టాకు ఎత్తించుకున్నారు. అయితే ఇప్పుడు ఫీజుల్లో రాయితీ అలా వదిలేసి హామీ ఇచ్చినవారు చేతులెత్తే పరిస్థితి వచ్చింది. దీంతో 18 శాతం వడ్డీతో బార్ల యజమానులు నేడు లైసెన్సు ఫీజు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. 31వ తేదీ లోగా లైసెన్స ఫీజు చెల్లించకుంటే సెప్టెంబరు 1వతేదీన షాపులు సీజ్‌ చేస్తామని ఎక్సైజ్‌ శాఖ హెచ్చరించడంతో చెల్లింపులకు రెడీ అయ్యారు. లైసెన్సు ఫీజుపై ఏటా 10 శాతం అదనంగా చెల్లించాలి. అంటే ఇప్పుడు రూ.1.80 కోట్లు ఉన్న వారు రూ.1.98 కోట్లు చెల్లించాలి. 20వ తేదీ లోపు ఈ ఫీజు చెల్లించలేదు కాబట్టి దీనికి 18 శాతం వడ్డీతో ఇప్పుడు చెల్లించాలి. అంటే అదనంగా మరో రూ.35 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. ప్రైవేటు మద్యం పాలసీ వస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లైసెన్సు ఫీజుల్లో రాయితీ ఇస్తే ఈసారి కూడా గట్టెక్కుతామని వీరంతా ఆశించారు. మొదటికే మోసం వచ్చేలా చివరకు 18 శాతం వడ్డీతో డబ్బులు చెల్లించాల్సి రావడంతో బార్ల యజమానులు లబోదిమోమంటున్నారు. కూటమి నేతలు తమను నిలువునా ముంచేశారని వాపోతున్నారు.

Updated Date - Aug 30 , 2024 | 11:52 PM

Advertising
Advertising