ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

High Court : చట్టానికి అనుగుణంగానే పెద్దిరెడ్డికి భద్రత

ABN, Publish Date - Jun 29 , 2024 | 05:58 AM

మాజీ మంత్రి, పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చట్టనిబంధనలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టుకు నివేదించారు.

  • హైకోర్టుకు ఏజీ దమ్మాలపాటి నివేదన

  • గత భద్రత కొనసాగించాలని

  • పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి పిటిషన్లు

  • కౌంటర్లు వేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశం

  • విచారణ 8వ తేదీకి వాయిదా

అమరావతి, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చట్టనిబంధనలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టుకు నివేదించారు. మంత్రి హోదాలో ఆయనకు 5+5 సెక్యూరిటీ ఇచ్చారని, ప్రస్తుతం ఆయన సాధారణ ఎమ్మెల్యే మాత్రమేనని, అందుచేత 1+1 భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. మంత్రిగా ఉండగా తనకు ఇచ్చిన 5+5 సెక్యూరిటీని కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పెద్దిరెడ్డి, అలాగే తనకున్న 4+4 భద్రతను కొనసాగించేలా ఆదేశించాలంటూ ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కూడా మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై శుక్రవారం న్యాయస్థానం విచారణ జరిపింది.

పిటిషనర్ల తరఫున న్యాయవాది గుడిసేవ నరసింహారావు వాదనలు వినిపించారు. పెద్దిరెడ్డి మంత్రిగా ఉండగా 5+5 సెక్యూరిటీ ఉండేదని.. ఎలాంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా భద్రతను తగ్గించారని తెలిపారు. దమ్మాలపాటి వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగబద్ధ పదవులు అలంకరించినవారికి.. ప్రజాప్రతినిధులు, ఇతరులకు భద్రత కల్పించే విషయంలో తగు ఉత్తర్వులు ఉన్నాయని.. వాటికి అనుగుణంగానే అధికారులు నడుచుకుంటున్నారని పేర్కొన్నారు. అదనపు భద్రత కల్పించాలని కోరుతూ జిల్లా ఎస్పీకి పెద్దిరెడ్డి దరఖాస్తు చేసుకున్నారని.. అదనపు భద్రత అవసరంలేదని ఎస్పీ అభిప్రాయపడ్డారని, ప్రస్తుత దరఖాస్తు భద్రత రివ్యూ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉందని తెలిపారు. పిటిషనర్లకు ప్రాణహాని ఉందని నిరూపించేందుకు కోర్టు ముందు ఎలాంటి ఆధారాలు ఉంచలేదన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని, అందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవరి పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేశారు.

Updated Date - Jun 29 , 2024 | 05:58 AM

Advertising
Advertising